First Day First Show: హీరోకు పవన్ సినిమా టికెట్లు దొరికాయా? లేదా? ఫస్డ్ డే ఫస్ట్ షో ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
First Day First Show OTT Release: నూతన హీరో, హీరోయిన్లు శ్రీకాంత్ రెడ్డి ,సంచిత బాషు జంటగా నటించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. జాతిరత్నాలు సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన అనుదీప్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు.
First Day First Show OTT Release: నూతన హీరో, హీరోయిన్లు శ్రీకాంత్ రెడ్డి ,సంచిత బాషు జంటగా నటించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. జాతిరత్నాలు సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన అనుదీప్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్స్ హీరో ఎలా సంపాదించాడనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్ జన్మదిన కానుకగా సెప్టెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో విడుదలైన రెండు వారాల్లోపే డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహ లో ఈ నెల 23 నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా ఈ సినిమాను పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మించారు. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ అంచనాలు పెంచేసినా థియేటర్లలో విడుదలయ్యాక మాత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. మరి థియేటర్లలో ఈ సినిమాను చూడలేని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Relive the nostalgia of cinema and celebration ? #FirstDayFirstShow will be streaming on @ahavideoIN from Sept 23rd.#FirstDayFirstShowOnAHA #FDFS @Im_Srikanth_R @SanchitaBashu24 @Wamceee @lnputtamchetty @anudeepfilm @radhanmusic @PoornodayaFilms @SrijaEnt @MitravindaFilms pic.twitter.com/dtbNM2A6FO
ఇవి కూడా చదవండి— Srija Entertainments (@SrijaEnt) September 14, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..