Vijay Devarakonda: పెద్ద మనస్సు చాటుకున్న రౌడీ బాయ్.. ఆ పేదింటి డ్యాన్సర్‌కు జీవితాంతం..
Dance Ikon- Aha:: టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా కాలంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి మన్ననలు అందుకున్న ఈ యంగ్ హీరో తాజాగా ఓ పేదింటి డ్యాన్సర్‌కు అండగా నిలిచాడు.
Dance Ikon- Aha:: టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా కాలంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి మన్ననలు అందుకున్న ఈ యంగ్ హీరో తాజాగా ఓ పేదింటి డ్యాన్సర్‌కు అండగా నిలిచాడు. అతనిలోని డ్యాన్స్ ట్యాలెంట్‌ను గుర్తించిన విజయ్ జీవితాంతం తన రౌడీస్ బ్రాండ్‌వేర్ దుస్తులను అందిస్తానని హామీ ఇచ్చాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నాన్-ఫిక్షన్ కేటగిరీలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకునేందుకు డ్యాన్స్ ఐకాన్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ యాంకర్ ఓంకార్ ఈ డ్యాన్సింగ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ రమ్యకృష్ణ జడ్జీగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించి కంటెస్టెంట్ రాయ్‌చూర్ ఆనంద్‌ను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది ఆహా యాజమాన్యం.
ఇందులో ఆనంద్ కుటుంబ నేపథ్యం గురించి వివరంగా చెప్పుకొచ్చారు. అతని తల్లి ఓ కూరగాయాల వ్యాపారి కాగా.. తండ్రి ఆటో నడుపుతున్నాడు. కాగా ఓ మురికి వాడల్లో నివసిస్తోన్న ఆనంద్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో మక్కువ. అయితే అతని కుటుంబ నేపథ్యం అతని కలకు అడ్డుగా నిలిచింది. ఓ డ్యాన్స్ టీచర్ వద్ద శిక్షణ తీసుకుంటూనే తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. కాగా ఆహా డ్యాన్స్ ఐకాన్‌షోలో కంటెస్టెంట్‌గా ఎంపికైన ఆనంద్ తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ షోకు హాజరైన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, అనన్యపాండే, జడ్జి శేఖర్ మాస్టర్, శ్రీముఖి, యశ్ మాస్టర్, మోనాల్ గజ్జర్ అందరూ అతని డ్యాన్స్‌కు ముగ్ధులయ్యారు. కాగా ఆనంద్ దీన పరిస్థితి తెలుసుకున్న విజయ్ అతనికి అండగా నిలిచాడు. పేదరికంతో బాధపడుతోన్న యంగ్ డ్యాన్సర్‌కు జీవితాంతం తన రౌడీవేర్ బ్రాండ్ దుస్తులు అందిస్తానని హామీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. రౌడీబాయ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడని అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఆహా డ్యాన్స్ ఐకాన్ షో ఇప్పటికే సెప్టెంబర్ 11న ఆహాలో ప్రీమియర్ అయింది. సెప్టెంబర్ 17 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ డ్యాన్సింగ్ షో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..