Yuzvendra Chahal: ఆమే నా బలమంటూ మరోసారి భార్యపై ప్రేమను చాటుకున్న చాహల్‌.. వైరలవుతోన్న బ్యూటిఫుల్‌ వీడియో

Yuzvendra Chahal- Dhanashree Verma: భారత జట్టు అగ్రశ్రేణి స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌, అతని సతీమణి ధనశ్రీ వర్మలు విడిపోతున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు గుప్పుమన్నాయి. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని, నెట్టింట్లో వచ్చే వార్తలను నమ్మవద్దంటూ భార్యాభర్తలిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై స్పష్టత నిచ్చారు

Yuzvendra Chahal: ఆమే నా బలమంటూ మరోసారి భార్యపై ప్రేమను చాటుకున్న చాహల్‌.. వైరలవుతోన్న బ్యూటిఫుల్‌ వీడియో
Yuzvendra Chahal
Follow us
Basha Shek

|

Updated on: Sep 15, 2022 | 9:16 PM

Yuzvendra Chahal- Dhanashree Verma: భారత జట్టు అగ్రశ్రేణి స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌, అతని సతీమణి ధనశ్రీ వర్మలు విడిపోతున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు గుప్పుమన్నాయి. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని, నెట్టింట్లో వచ్చే వార్తలను నమ్మవద్దంటూ భార్యాభర్తలిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై స్పష్టత నిచ్చారు. దయచేసి ఇలాంటి అర్థం పర్థం లేని రూమర్లను సృష్టించవద్దంటూ సోషల్‌ మీడియా వేదికగా వేడుకున్నాడు. ధనశ్రీ కూడా ఇలాంటి పుకార్లు తమను కలచివేస్తున్నాయంటూ వాపోయింది. తద్వారా తమ అన్యోన్య దాంపత్యంపై వస్తోన్న రూమర్లకు చెక్‌ పెట్టారు. ఈనేపథ్యంలో యజువేంద్ర చహల్‌ మరోసారి తన సతీమణిపై ప్రేమను చాటుకున్నాడు. ఇద్దరూ అన్యోన్యంగా గడిపిన క్షణాలను ఓ వీడియో రూపంలో ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నాడు. ‘అత్యంత శక్తిమంతమైన మహిళ.. తనే నా బలం’’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించగా.. లక్షలాది లైకులు వచ్చాయి. ‘లవ్లీ కపుల్, క్యూట్‌ కపుల్‌’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా చాహల్‌ ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. అంతకంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగే టీ20 సిరీస్‌లలో ఆడనున్నాడు. కాగా కొరియోగ్రాఫర్‌గా, ఫేమస్‌ యూట్యూబర్‌గా రాణిస్తోన్న ధనశ్రీ కొద్ది రోజుల క్రితం డ్యాన్స్‌ చేస్తూ గాయపడింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకుంది. కాగా దంపతూలిద్దరూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..