Ravindra Jadeja: ఊతకర్రల సాయంతో నడుస్తోన్న జడ్డూ.. ఒక్కో అడుగు వేస్తూ.. ఫొటోలు వైరల్‌

Viral Photo: మోకాలి గాయం కారణంగా ఆసియా కప్‌ మధ్యలోనే టోర్నీ నుంచి వైదొలిగాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. గాయం తీవ్రంగా ఉండడంతో ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు.

Ravindra Jadeja: ఊతకర్రల సాయంతో నడుస్తోన్న జడ్డూ.. ఒక్కో అడుగు వేస్తూ.. ఫొటోలు వైరల్‌
Ravindra Jadeja
Follow us
Basha Shek

|

Updated on: Sep 15, 2022 | 7:48 PM

Viral Photo: మోకాలి గాయం కారణంగా ఆసియా కప్‌ మధ్యలోనే టోర్నీ నుంచి వైదొలిగాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. గాయం తీవ్రంగా ఉండడంతో ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. అటు బ్యాటుతో, బంతితో అమోఘంగా రాణిస్తోన్న ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ప్రపంచకప్‌లో లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటేనని క్రీడానిపుణులు, అభిమానులు విశ్లేషిస్తున్నారు. కాగా దుబాయ్‌లో అడ్వెంచర్ గేమ్స్ ఆడే క్రమంలో అదుపు తప్పి పడిపోవడంతో జడేజా మోకాలికి గాయమైంది. అది తీవ్రమైంది కావడంతో వెంటనే సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇదే విషయమై బీసీసీఐ జడేజాతో పాటు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే గతవారమే తన మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు జడ్డూ. ప్రస్తుతం తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ మెల్లగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తన రికవరీ అప్‌డేట్స్‌ ను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు.

కాగా తాజాగా జడ్డూ చేసిన ఒక ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో రెండు ఊతకర్రల సాయంతో నడుస్తూ కనిపించాడు. దీనికి ‘వన్ స్టెప్ ఎట్ ఎ టైం’ (ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నా) అని క్యాప్షన్ ఇచ్చాడు. కాగా మైదానంలో చిరుతలా కదిలే జడేజా.. ఇలా ఊత కర్రలతో నడవాల్సి రావడం బాధాకరమని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అతను త్వరగా కోలుకోవాలని, మళ్లీ జట్టులోకి రావాలని కోరుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కాగా ఆసియాకప్‌ లీగ్‌ దశలో పాక్‌, హాంకాంగ్‌లపై టీమిండియా విజయం సాధించడంలో జడ్డూ కీలక పాత్ర పోషించాడు. అయితే అనూహ్యంగా గాయం బారిన పడి టోర్నీ నుంచి వైదొలగాడు. అతని సేవలు కోల్పోయిన భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..