Dinesh Karthik: మీ వల్లే నా కల సాకారమైంది అంటూ డీకే ట్వీట్‌.. వారికి స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పిన ఫినిషర్‌

T20 World Cup 2022: 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik). ప్రతిభావంతుడైన క్రికెటర్‌ అయినప్పటికీ అప్పటికే జట్టులో స్థిరపడ్డ వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని నీడలో అవకాశాలు పొందలేకపోయాడు.

Dinesh Karthik: మీ వల్లే నా కల సాకారమైంది అంటూ డీకే ట్వీట్‌.. వారికి స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పిన ఫినిషర్‌
Dinesh Karthik
Follow us

|

Updated on: Sep 16, 2022 | 9:07 AM

T20 World Cup 2022: 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik). ప్రతిభావంతుడైన క్రికెటర్‌ అయినప్పటికీ అప్పటికే జట్టులో స్థిరపడ్డ వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని నీడలో అవకాశాలు పొందలేకపోయాడు. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందులు అతని క్రికెట్‌ కెరీర్‌ను బాగా దెబ్బతీశాయి. ఒకానొక దశలో ఇక ఆటకు గుడ్‌బై చెప్పుదామనుకున్నాడు. అయితే భార్య దీపికా పల్లికల్‌ ప్రోత్సాహంతో మళ్లీ ఆటపై దృష్టి సారించాడు. ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించి ఏకంగా 37 ఏళ్ల వయసులో జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో భారత జట్టులో ఫినిషర్‌గా, వికెట్‌ కీపర్‌గా స్థానం దక్కించుకున్నాడు. కాగా రిటైర్మెంట్ తీసుకునే వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడంపై కార్తిక్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న బెంగళూరు ఫ్రాంఛైజీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసుకునే అవకాశం కల్పించారంటూ సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు.

కాగా భారత జట్టులోకి డీకే రావడాన్ని అభినందిస్తూ బెంగళూరు ప్రత్యేకంగా ట్వీట్‌ చేసింది. దీనికి రిప్లై ఇచ్చిన కార్తిక్‌ ఇలా స్పందించాడు.. ‘నా ప్రయాణంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించి నా కలను నిజం చేసిన బెంగుళూరు జట్టుకు ధన్యవాదాలు. ముఖ్యంగా..నేను టీమ్‌ ఇండియా తరఫున ఆడుతున్నప్పటికీ ‘బెంగళూరు.. బెంగళూరు’ అంటూ నన్ను ప్రోత్సహించిన అభిమానులకు కృతజ్ఞతలు’ అని డీకే ట్వీట్‌ చేశాడు. కాగా అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు పొట్టి ప్రపంచకప్‌ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం వికెట్‌ కీపర్‌లుగా రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. అక్టోబర్‌ 23న పాక్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..