PAK vs ENG: పెద్ద మనసు చాటుకున్న ఇంగ్లండ్‌ క్రికెటర్లు.. పాక్‌ వరద బాధితులను ఆదుకోవడం కోసం..

Pakistan vs England: సుమారు 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టింది ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు. 2005లో చివరిసారిగా ఆ జట్టు పాక్‌లో పర్యటించింది. ప్రతిష్ఠాత్మక 20 ప్రపంచ కప్‌కు ముందు సన్నాహకంగా తమను తాను సిద్ధం చేసుకోవడానికి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పాక్‌ పర్యటనలో ఏకంగా 7 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

PAK vs ENG: పెద్ద మనసు చాటుకున్న ఇంగ్లండ్‌ క్రికెటర్లు.. పాక్‌ వరద బాధితులను ఆదుకోవడం కోసం..
Jos Buttler
Follow us

|

Updated on: Sep 16, 2022 | 9:34 AM

Pakistan vs England: సుమారు 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టింది ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు. 2005లో చివరిసారిగా ఆ జట్టు పాక్‌లో పర్యటించింది. ప్రతిష్ఠాత్మక 20 ప్రపంచ కప్‌కు ముందు సన్నాహకంగా తమను తాను సిద్ధం చేసుకోవడానికి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పాక్‌ పర్యటనలో ఏకంగా 7 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకోసం ఇంగ్లండ్‌ క్రికెటర్లు గురువారం కరాచీకి చేరుకున్నారు. కాగా ఈ జట్టులో కెప్టెన్‌ బట్లర్‌ సహా ఇతర ఆటగాళ్లకు పాక్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడిన అనుభవం లేదు. మరోవైపు గాయంతో బాధపడుతున్న కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌ సిరీస్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కాగా పాక్‌లో అడుగుపెట్టిన వెంటనే విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు కెప్టెన్‌ బట్లర్‌. ఈ సందర్భంగా పాక్‌ వరద బాధితులకు తమ వంతు సహాయం చేస్తామని ప్రకటించి తమ విశాల హృదయాన్ని చాటుకున్నాడు.

కాగా ఇటీవల పాక్‌లో భారీ వర్షాలు కురిశాయి. వరదల్లో చాలా ప్రాంతాలు నీటమునగడంతో వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలోనే బట్లర్‌ కీలక ప్రకటన చేశాడు. ‘ చాలా కాలం తర్వాత పాక్‌లో అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇటీవల సంభవించిన వరదల్లో పాక్‌ భారీగా నష్టపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మేం సిరీస్‌ ఆడేందుకు వచ్చాం. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. మ్యాచ్‌లకు సంబంధించిన డొనేషన్స్‌ను వరద బాధితులకు అందేలా చూస్తాం. ఈవిషయంపై మా క్రికెట్‌ బోర్డుతో కూడా మాట్లాడాం. ఈసీబీ కూడా పాక్‌కు పెద్ద మొత్తంలో సాయం చేడయానికి ముందుకు రానుంది. ఈ 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌.. వరద నష్టాల నుంచి పాక్‌ ప్రజలకు, క్రికెట్‌ అభిమానులకు మంచి ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు బట్లర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..