అమెరికాలో మరో భారతీయుడి హత్య.. తుపాకీతో పంజాబ్‌ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు

కాల్పుల ఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు 26 ఏళ్ల నిందితుడు క్రిస్ కోప్లాండ్‌ను అరెస్ట్‌ చేశారు. మరోవైపు పరమ్‌వీర్‌ సింగ్‌ మృతదేహం స్వగ్రామం ధాపై చేరుకుంది.

అమెరికాలో మరో భారతీయుడి హత్య.. తుపాకీతో పంజాబ్‌ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు
Gun Firing
Follow us

|

Updated on: Sep 16, 2022 | 9:24 AM

Punjab Youth Shot Dead:అమెరికాలో భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలోని జార్జియాలో కిరాణా దుకాణం నడుపుతున్న పంజాబ్‌ యువకుడ్ని ఒక దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. పట్టపగలే జరిగిన ఈ కాల్పుల ఘటనలో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మృతుడు.. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా ధాపై గ్రామానికి చెందిన పరమ్‌వీర్ సింగ్‌గా గుర్తించారు. అతడు అమెరికాలోని జార్జియాలో గ్రోసరీ షాపు నిర్వహిస్తున్నాడు.

ఆఫ్రికా జాతీయుడైన ఒక వ్యక్తి పట్టపగలు తుపాకీతో ఆ షాప్‌లోకి ప్రవేశించాడు. పర‌మ్‌వీర్‌ సింగ్‌ను బెదిరించి డబ్బులు దోపిడీ చేశాడు. అనంతరం అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కంప్యూటర్‌ పరికరాలను కూడా ఎత్తుకెళ్లాడు. దుండగుడి కాల్పుల్లో గాయపడిన పరమ్‌వీర్‌ సింగ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఇదంతా షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు వీడియోను రిలీజ్‌ చేయటంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కాల్పుల ఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు 26 ఏళ్ల నిందితుడు క్రిస్ కోప్లాండ్‌ను అరెస్ట్‌ చేశారు. మరోవైపు పరమ్‌వీర్‌ సింగ్‌ మృతదేహం పంజాబ్‌లోని స్వగ్రామం ధాపై చేరుకుంది. కొడుకు మృతితో అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఒక్కడే కుమారుడైన పరమ్‌వీర్‌ సింగ్‌ మరణాన్ని వారు తట్టుకోలేపోతున్నారు. మరోవైపు ఆ గ్రోసరీ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు చెందిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు