AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పోలీసులకే రక్షణగా ఉంటున్న పాములు..స్టేషన్‌ చుట్టూ 24/7 కాపలా.. ఎక్కడంటే..

పోలీసులకే కష్టం వచ్చింది.. దాంతో వారిని ఆదుకునేందుకు పాములు రంగంలోకి దిగాయి. చట్టాన్ని అమలు చేసేవారికి పాములే రక్షకులుగా మారాయి.

Viral News: పోలీసులకే రక్షణగా ఉంటున్న పాములు..స్టేషన్‌ చుట్టూ 24/7 కాపలా.. ఎక్కడంటే..
Snakes
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2022 | 7:47 AM

Share

Kerala: పోలీసు సిబ్బందిని సాధారణంగా ప్రజలకు రక్షకభటులుగా భావిస్తారు. కానీ, అలాంటి పోలీసులకే కష్టం వచ్చింది.. దాంతో వారిని ఆదుకునేందుకు పాములు రంగంలోకి దిగాయి. చట్టాన్ని అమలు చేసేవారికి పాములే రక్షకులుగా మారాయి. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ, ఈ వింత సంఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళలోని హై-రేంజ్ ఇడుక్కిలోని ఫారెస్ట్-ఫ్రింజ్ పోలీస్ స్టేషన్‌లో ఖాకీలకు రక్షణగా పాములు పనిచేస్తున్నాయి. కేరళ-తమిళనాడు సరిహద్దులో ఉన్న కుంబుమెట్టు పోలీస్ స్టేషన్ చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. దీంతో ఈ పోలీస్ స్టేషన్‌కి కోతులు బెడద ఎక్కువగా ఉంది. వానర బెడదతో పోలీసులు విసిగిపోయారు. ఎంత తరిమికొట్టినా.. మళ్లీ మళ్లీ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి కోతులు. దాంతో కోతుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఓ విచిత్రమైన ఆలోచన చేశారు. కోతులను భయపట్టేందుకు రబ్బరు పాములను పెడుతున్నారు. దాంతో వారి ట్రిక్ చాలా బాగా పనిచేసింది.

అచ్చం నిజం పాముల్లా ఉండే రబ్బరు పాములను తయారు చేయించి.. వాటిని తెచ్చి పోలీస్ స్టేషన్‌ సమీపంలోని చెట్ల కొమ్మలపై, గ్రిల్స్‌పై పెట్టారు. దాంతో అవి నిజమైన పాములనుకుని కోతులు ఆ చుట్టుపక్కలకు రాకుండా పారిపోతున్నాయి. రబ్బరు పాములను చూసిన తర్వాత కోతులు ఈ పోలీస్ స్టేషన్‌ వైపుకు రావాలంటేనే భయపడుతున్నాయని చెప్పారు కుంబుమెట్టు సబ్ఇన్‌స్పెక్టర్‌ పీకే లాల్‌భాయ్‌. కోతులు ఎక్కువగా వచ్చే దగ్గర అలా రబ్బరు పాములను పెడితే వాటి బెడద తీరిపోతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి