SCO Summit: భారత్‌కు అద్భుత అవకాశం షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం..

SCO Summit: షాంఘై సహకార సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఇండియా..

SCO Summit: భారత్‌కు అద్భుత అవకాశం షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం..
Sco Summit
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 16, 2022 | 6:24 AM

SCO Summit: షాంఘై సహకార సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఇండియా నుంచి బయలుదేరిన ఆయన రాత్రి సమయానికి అక్కడికి చేరుకున్నారు. అయితే, పాశ్చాత్య దేశాల వైఖరి, రష్యా-చైనా దేశాధినేతల ముఖాముఖి సమావేశం నేపథ్యంలో సేఫ్‌గా ఉండటంతో పాటు.. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆప్ఘాన్‌ సంక్షోభం నేపథ్యంలో భారత్‌ చేయబోయే ప్రకటన కీలకంగా మారింది. అంతేకాదు.. ఎనిమిది దేశాల షాంఘై సహకార సంస్థ(SCO) నాయకుల శిఖరాగ్ర సమావేశం భారత్‌కు అద్భుత అవకాశం, సవాల్ రెండింటినీ అందిస్తోందని దౌత్య నిపుణులు భావిస్తున్నారు.

భారత్ స్థాయిని పెంచనున్న సమ్మిట్..

రష్యా, మధ్య ఆసియా దేశాలు, ఇరాన్‌తో వంటి మరికొన్ని దేశాలు భారత్‌కు ఇంధనాన్ని సరఫరా చేస్తుంటాయి. ఈ దేశాలు భారత్‌కు క్రూడాయిల్ తక్కువ ధరకే అందించే అవకాశం ఉంది. అయితే, చైనా-పాకిస్తాన్ జట్టు, శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే ప్రధాన దేశాలన్నీ పాశ్యాత్య దేశాల పట్ల వ్యతిరేక వైఖరితో ఉన్నాయి. ఈ నేపథ్యలో పాశ్చాత్య దేశాల పట్ల వైఖరి, ఉక్రెయిన్ వివాదంపై స్పందన భారత్‌‌ను ఇరకాటంలోకి నెట్టింది. అయితే, భారత్ మాత్రం ఇప్పటికీ తటస్థ వైఖరినే అవలంభిస్తోంది.

ప్రస్తుత విభజిత ప్రపంచంలో భారత్ తన శక్తి, ఆహారం, పారిశ్రామిక భద్రతను పెంచుకోవడానికి సమతుల్యతను కాపాడుకోవాల్సి ఉంది. ఇండియా ముందు ప్రధానంగా రెండు సవాళ్లు ఉన్నాయి. అత్యంత కీలకమైనది.. పొరుగున ఉన్న రెండు శత్రు దేశాలకు వ్యతిరేకంగా సురక్షితంగా ఉండటం. రెండోది.. దేశాల మధ్య స్నేహబంధం విషయంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చే ఒత్తి్ళ్లు తట్టుకుని తట్టుకుని నిల్చోవడం. ఈ నిర్ణయం ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా.. ఎనిమిది దేశాల షాంఘై సహకార సంస్థ(SCO) నాయకుల శిఖరాగ్ర సమావేశంలో ఇండియా స్థాయిని పెంచుతుందని భావిస్తున్నారు.

ప్రపంచంలో అగ్రస్థానమే లక్ష్యంగా..

ప్రపంచంలో తన స్థానం, స్పష్టమైన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకున్న భారత్.. పరిశీలనాత్మక స్వయంప్రతిపత్తిని కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వేగంగా మారుతున్న పరిస్థితులు.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదటి దశాబ్దాల నాటి పరిస్థితులు చాలా భిన్నం. నాటి విధానాలను నేడూ కంటిన్యూ చేయడం అనేది సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత వ్యూహాత్మక వైఖరిని అవలంభించాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో స్వయంప్రతిపత్తిని రక్షించుకోవాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధం వంటి పశ్చిమ-తూర్పు సంఘర్షణ అంశాలకు దూరంగా ఉండటానికి, శాంతిని సృష్టించే శక్తిగా తనను తాను అందించుకోవడానికి, బలమైన దేశంగా గుర్తింపునకు ఈ సదస్సు భారత్‌కు సహాయపడుతుంది.

భారత్ ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటూ వచ్చింది. యూఎస్, యూరప్ దేశాలతో సైనిక, వాణిజ్యం సంబంధాలను కొనసాగిస్తూ.. క్వాడ్, ఐపీఈఈ, యూకే, ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో రష్యాకు వ్యతిరేకంగా వెళ్లాలిన పశ్చిమ దేశాల నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పటికీ.. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఇండియా.

భారత్-రష్యా సంబంధాలు..

రష్యాతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకే సైనిక సామాగ్రిని కొనుగోలు చేయడం జరుగుతుంది. రష్యన్ ఫార్-ఈస్ట్‌లోని విస్తారమైన చమురు, గ్యాస్, ఖనిజ వనరులకు, ముఖ్యంగా సఖాలిన్-1 చమురు, గ్యాస్ క్షేత్రాలకు ఇంధన భద్రతను అందిస్తుంది. మాస్కోపై పాశ్చాత్య ఆంక్షలను అధిగమించేందుకు రెండు దేశాలు రూపాయి, రూబుల్‌లో వ్యాపారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరి డెబిట్ కార్డులను మరొకరు గుర్తించాలని నిర్ణయించుకున్నాయి.

మోదీ, జిన్‌పింగ్ కలుస్తారా?

ఇక చైనా విషయానికొస్తే.. లడఖ్‌లోని LAC వెంట ఉన్న సైనిక స్థానాలను, బలగాలను విజయవంతంగా ఉపసంహరించుకోవడం, రాబోయే రోజులకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం బట్ట చూస్తే.. భారతదేశం పట్ల దాని శత్రుత్వం కొంతవరకు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో భారతదేశం తన విదేశాంగ విధానాన్ని బలంగా నొక్కిచెప్పిన నేపథ్యంలో చైనాలో ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా.. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో చైనా ఎలాంటి ఏకపక్ష చర్యలు చేపట్టే అవకాశం అయితే లేదు. అయితే, చైనా కదలికలపై ఢిల్లీ పెద్దలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు. ఇదిలాఉంటే.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని మోదీల మధ్య ప్రత్యేక సమావేశం ఏమైనా ఉంటే మాత్రం అదే ఈ సమ్మిట్‌లో హైలెట్ అవుతుంది.

షరీఫ్‌ను మోదీ కలుస్తారా?

ఈ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిసే అవకాశం లేదు. దీనికి చాలా కారణాలున్నాయి. ఆర్థిక, రాజకీయ, పర్యావరణ సంక్షోభాలతో అట్టుడికిపోతున్న పాకిస్తాన్‌లో షరీఫ్ ఇంకా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఢిల్లీ అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. వాణిజ్యంతో సహా, కీలక అంశాలపై పాకిస్తాన్ మొదటి అడుగు వేయాల్సి ఉంటుంది. కానీ, షరీఫ్ అటువైపుగా అడుగులు వేసే పరిస్థితి లేదు.

మొత్తంగా రాబోయే రెండు రోజుల్లో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటుందనే దానిపై కొంత స్పష్టత రావడానికి SCO తీర్మానాలు, సమ్మిట్‌లో పాల్గొనేవారి మధ్య జరిగే సమావేశాలు, నాయకుల బాడీ లాంగ్వేజీలను ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..