Toxic work culture: విరామంలేకుండా అదే పనిగా కూర్చుని వర్క్ చేస్తున్నారా? జాగ్రత్త.. అకాల మరణ ప్రమాదం ఎక్కువ..
ఒక వ్యక్తి రోజుకు 18 గంటల పాటు కూర్చుని విరామం లేకుండా పనిచేస్తే ఏమవుతుందో తెలుసా? అలాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Too much sitting seem to increase the risk of death from cardiovascular disease and cancer: బాంబే షేవింగ్ కంపెనీ సీఈవో శంతను దేస్పాండే తాజాగా లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్టు పెట్టాడు. ఈ ఒక్క పోస్టు సదరు కంపెనీ అనుసరిస్తున్న టాక్సిక్ వర్కింగ్ కల్చర్‌ను ప్రపంచానికి తెలిసేలా చేసింది. ప్రస్తుతం సీఈవో శంతను దేస్పాండే పెట్టిన పోస్టు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఇంతకీ అతను ఏం రాశాడంటే.. తమ కంపెనీ ఉద్యోగులు రోజుకు 18 గంటల (working 18 hours a day) పని చేయాలని సిఫార్సు చేశాడు. ఇంకా ఏం చెప్పాడంటే.. ’22 ఏళ్ల వయసులో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినవారు పుష్టిగా తిని, ఆరోగ్యం ఉండాలి. అలాగే రోజుకు 18 గంటల చొప్పున కనీసం 4 నుంచి 5 ఏళ్లపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. వర్క్ లైఫ్‌ను, ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసే అనేక మంది యంగ్‌స్టర్స్‌ను నేను చూస్తున్నాను. ఐతే ఇది మరీ అంత తొందరగా కాదు. మీరు చేసే పనిని దైవంగా భావించి దాని స్థానంలో మీ వర్క్‌ను చేర్చండి. మొదటి ఐదేళ్లు కరీర్‌కు వ్యచ్ఛించండి. ర్యాండమ్‌గా కాకుండా జాబ్‌పైనే మీ దృష్టినంతా పెడితే, మీరు మరింత మెరుగ్గా తయారవుతారని’ శంతను దేశ్‌పాండే ఫ్రెషర్లు, Z వర్క్ ఫోర్సుకు సలహాలిస్తూ లింక్డ్‌ఇన్‌లో పోస్టు పెట్టాడు. దీంతో సుదీర్ఘ పని గంటల వల్ల ఎదుర్కొనే శారీరక, ఆరోగ్య సమస్యలు తెర మీదకొచ్చాయి. అవేంటో మీరు తెలుసుకోండి..
మానసిక సమస్యలు ఆఫీసుల్లో ఉండే వర్కింగ్ కల్చర్ ఆయా కంపెనీలలో పనిచేసే ఎంప్లాయిస్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించాయి. ముఖ్యంగా poor work culture ఉన్న కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు మూడు రెట్లు అధికంగా డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. సుదీర్ఘ పని గంటలు (LWH) సైకలాజికల్ సేఫ్టీ క్లైమాట్ (PSC)ను కలుషితం చేస్తాయని, తత్ఫలితంగా డిప్రెషన్‌కు దారితీస్తాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఉద్యోగుల్లో మేజర్ డిప్రెషన్ లక్షణాలకు, LWHకు సంబంధం ఉన్నట్లు వీరి పరిశోధనల్లో బయటపడింది.
శారీరక ఆరోగ్య సమస్యలు ఎటువంటి శారీరక కదలికలు లేకుండా సుదీర్ఘ సమయంపాటు కూర్చుని పనిచేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేట మూడు మిలియన్లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అంటే మొత్తం మరణాలలో ఇది దాదానె ఆరు శాతానికి సమానం. మరణాలకు దారితీస్తున్న కారణాల్లో ఇది నాలుగో ప్రధాన కారణం. రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ వల్ల 21-25 శాతం మరణాలు సంభవిస్తుండగా, మధుమేహం వల్ల 27 శాతం, గుండె జబ్బుల కారణంగా 30 శాతం మంది మృతి చెందుతున్నారు. సిగరేట్ (ధూమపానం) తర్వాత శారీరక కదలికలు లేకపోవడం వల్లనే ఆస్ట్రేలియాలో అత్యధికంగా క్యాన్సర్ వ్యాధులు సంభవిస్తున్నాయి. సుదీర్ఘ సమయం పాటు కూర్చుని పనిచేసే వారిలో గుండె జబ్బులు నిశ్శబ్దంగా వృద్ధి చెందుతాయి. భారతీయుల్లో సుదీర్ఘ పని గంటల ప్రభావం రానున్న రోజుల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. లాక్‌డౌన్ సమయంలో ఫిజికల్ యాక్టివిటీలకు అవకాశం లేకపోవడం వల్ల (నిశ్చల జీవనశైలి) స్థూలకాయం, డయాబెటిక్, బీపీ (రక్తపోటు) సమస్యలు మునుపెన్నడూలేని విధంగా ఒక్కసారిగా పెరిగాయని నవీ ముంబైలోని అపోలో హాస్పిటల్స్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రాహుల్ గుప్తా అన్నారు.
చాలా సేపు కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని పరిశోధనలు సైతం వెల్లడించాయి. తొలుత స్థూలకాయం ఆతర్వాత రక్తపోటు, హై బ్లడ్ షుగర్, నడుము చుట్టూ కొవ్వు చేరడం, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తాయి. కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనిచేసుకునే వారు గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌తో మరణించే అవకాశం ఎక్కువని దాదాపు 13 అధ్యయనాలు వెల్లడించాయి.
ఎటువంటి శారీరక శ్రమ లేకుండా రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారు ఊబకాయం వల్ల మరణించే ప్రమాదం ఉందని వారి పరిశోధనల్లో కనుగొన్నారు. 10 లక్షలకు పైగా వ్యక్తులపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడించారు. ఒక రోజులో కేవలం 60 నుంచి 75 నిమిషాలు మాత్రమే శారీరక కదలికలున్నవారు ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల అధికంగా ప్రభావితం అవుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. తక్కువ సమయం కూర్చుని పనిచేసేవారిలో మరణాలు తక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో తెలుసుకున్నారు.
మరైతే ఏం చెయ్యాలి?
గురుగ్రామ్‌లోని స్టెప్స్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్‌లో చైల్డ్, అడోలసెంట్ సైకాలజిస్టు అయిన డాక్టర్ ప్రమిత్ రస్తోగి ఏం చెబుతున్నారంటే.. ‘కొన్ని రకాల వృత్తుల్లో ఎక్కు వర్కింగ్ అవర్స్ డిమాండ్ చేస్తాయి. అంతమాత్రాన దానిని toxic work cultureగా పరిగణించకూడదు. కొన్ని ఫ్రొఫెషన్స్‌కు బ్యాక్ బ్రేకింగ్ వర్క్ అవసరం అవుతుంది. అటువంటి వృత్తులను టాక్సిక్ వర్క్ కల్చర్ (ప్రమాదకర పని వాతావరణం)గా పరిగణించవచ్చు. ఇటువంటి కంపెనీల్లోని ఉద్యోగులు వర్క్-ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయలేరు. ఐతే సుదీర్ఘ పని గంటలు చేసేవారు మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ ఉండాలి. అలాగే అధికంగా నీళ్లు తాగుతుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఉద్యోగంతోపాటు ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందని’ సూచిస్తున్నారు.