AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: ఎండలు, వర్షాలు.. గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఎండలు, వర్షాలు రెండూ ప్రభావం చూపనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర, కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాయలసీమ, మార్కాపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Weather Alert: ఎండలు, వర్షాలు.. గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jun 10, 2026 | 6:14 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నియి.. పగటి పూట ఎండలు, సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తు్న్నాయి. ఈ క్రమంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, కొంత ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మధ్య బంగాళాఖాతం నుండి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆకస్మికంగా ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు.

సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మిమీ, లావేరులో 64.5, మన్యం జిల్లా పాచిపెంటలో 48, అనకాపల్లి జిల్లా రావికమతంలో 29, ఎస్.రాయవరంలో 28.5, విశాఖ జిల్లా పెందుర్తిలో 28 మిమీ వర్షపాతం రికార్డైందన్నారు.

ఎండ తీవ్రత, వడగాలులు

గురువారం విజయనగరం బొండపల్లి, గజపతినగరం, గంట్యాడ, మెంటాడ మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా మక్కువ, పాటిపెంట, పార్వతీపురం, సాలూరు మండలాలు, కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ & రూరల్, పిఠాపురం మండలాలు, అల్లూరి జిల్లా అనంతగిరి మొత్తంగా 13 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 42 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు ఈ లింక్ లో చూడండి..:

విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41- 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. పోలవరం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40- 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

బుధవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 44.3డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.9, బాపట్ల జిల్లా ఇంకొల్లు, పోలవరం జిల్లా కూనవరంలో 43.8, కాకినాడ జిల్లా పిఠాపురం, విశాఖ జిల్లా గాజువాక, విజయనగరం జిల్లా రాజాంలో 43.6, కోనసీమ జిల్లా శివలలో 43.3, శ్రీకాకుళం జిల్లా రావివలసలో 43.2, కృష్ణా జిల్లా నందివాడలో 42.7, ఎన్టీఆర్ జిల్లా అల్లూరులో 42.5, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 42.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

Follow Us