AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి ఏకాదశి రోజున వికసించిన అరుదైన బ్రహ్మ కమలం.. భక్తురాలి ఇంట్లో మూడు పుష్పాలు పూసి ఆశ్చర్యం!

Brahma Kamal Flower: హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే అరుదైన బ్రహ్మ కమలం పుష్పం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ భక్తురాలి ఇంట్లో ఆషాఢమాసం తొలి ఏకాదశి రాత్రి వికసించింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే రాత్రివేళ వికసించే ఈ పవిత్ర పుష్పం మూడు ఒకేసారి పూయడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

తొలి ఏకాదశి రోజున వికసించిన అరుదైన బ్రహ్మ కమలం.. భక్తురాలి ఇంట్లో మూడు పుష్పాలు పూసి ఆశ్చర్యం!
Rare Brahma Kamal Blooms On Devshayani Ekadashi
N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 26, 2026 | 10:49 AM

Share

ఎక్కడో హిమాలయ ప్రాంతాలలో అద్భుతంగా వికసించే ఒక అరుదైన పుష్పం అది. ఉత్తరాఖండ్, భద్రీనాథ్ లాంటి విశిష్టత కలిగిన ప్రాంతంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే రాత్రి వేళ మాత్రమే వికసించే పుష్పం. అదే బ్రహ్మ కమలం. ఈ పుష్పం చాలా అరుదైనదిగా పూర్వీకుల నుంచి చెప్పుకుంటుంటారు. ఈ పుష్పం అన్ని పుష్పాలు మాదిరిగా వికసించవు. ఏడాదిలో ఒకే ఒక్క రోజు అది కూడా రాత్రి వేళ 9 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల లోపే బ్రహ్మ కమలం పుష్పం వికసించడం వీటి ప్రత్యేకత. ఈ పుష్పం వికసించేటప్పుడు చూసిన వారు అదృష్టవంతులుగా పురాణాల్లో ఉన్నట్లు చెపుతుంటారు. అలాంటి పుష్పం ఇంటిలో ఉంటే సాక్షాత్తు బ్రహ్మ దేవుడి ఆశీస్సులు ఉన్నట్లే అని హిందువుల నమ్మకం. ఇప్పుడు అలాంటి అరుదైన బ్రహ్మ కమలం పుష్పం ఆషాఢమాసం తొలి ఏకాదశి రోజున ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనీ శ్రీ బిందు అనే ఒక భక్తురాలు ఇంటిలో వికసించడం ప్రత్యేకత ను చాటుకుంది.

ఏడాదికి ఒక్క రోజు మాత్రమే వికసించే అరుదైన పుష్పం బ్రహ్మ కమలం. అది కూడా రాత్రి వేళలో 9 గంటల తరువాత వికసించి కేవలం రెండు, మూడు గంటల్లోనే వికసించిన పుష్పం తిరిగి మొగ్గగా ముడుచుకుంటుంది. అలాంటి ప్రత్యేకతను కలిగిన అరుదైన బ్రహ్మ కమలం సత్తుపల్లిలోని శివసాయి నగర్‌లో ఒక భక్తురాలు ఇంటిలో తొలి ఏకాదశి రోజున రాత్రి వేళలో మూడు బ్రహ్మ కమలం పుష్పాలు వికసించడం ప్రత్యేకతను చాటుకుంది. హిందువులు ఈ పుష్పాలు వికసించడం చూడటాన్ని అదృష్టంగా భావిస్తుంటారు.

బ్రహ్మ కమలం వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

Follow Us