IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరుకోవచ్చు
How to Become IAS Officer: ఐఏఎస్ (IAS) అధికారి కావాలనేది ఎంతో మంది యువత కల. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సరైన ప్రణాళిక, కఠినమైన శ్రమ, పట్టుదల అవసరం. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు ఐఏఎస్‌గా ఎంపికవుతారు. విద్యార్హతల నుంచి పరీక్షా విధానం వరకు ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహనతో సిద్ధమైతే ఐఏఎస్ కలను సాకారం చేసుకోవచ్చు..

చాలా మందికి జిల్లా కలెక్టర్ కావాలని కలలు కంటుంటారు. కానీ ఎలా ఆ కలను నెరవేర్చుకోవాలో తెలియక తికమకపడిపోతుంటారు. కలెక్టర్ కావాలంటే IAS (Indian Administrative Service) లను ఎంపిక చేసే పరీక్ష పాస్ కావాలి. ఇందుకు UPSC నిర్వహించే అత్యంత కఠినమైన Civil Services Examinationలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షను ప్రతి యేటీ Union Public Service Commission నిర్వహిస్తుంది. ఈ ఏడాదికి నోటిఫికేషన్ వచ్చేసింది. ప్రిలిమినరీ పరీక్ష గత మే 24వ తేదీన నిర్వహించారు కూడా. IAS అవ్వడానికి అర్హతలు ఏదైనా డిగ్రీ పాసైతే చాలు. డిస్టెన్స్ మోడ్‌లో సర్టిఫికెట్లు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏదైనా స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంటే IAS కోసం ప్రత్యేక డిగ్రీ అవసరం లేదు. BA, B.Com, B.Sc, B.Tech, MBBS ఇలా ఏ డిగ్రీ చదివిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయస్సు జనరల్ కేటగిరీ అయితే 21 నుంచి 32 సంవత్సరాలు, OBC అభ్యర్ధులకు 21 నుంచి 35 సంవత్సరాలు, SC, ST అభ్యర్ధులకు 21 నుంచి 37 సంవత్సరాల వయసు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..
UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది..
Preliminary Exam (ప్రిలిమ్స్)
ఈ పరీక్ష రెండు పేపర్లకు ఉంటుంది. General Studies పేపర్ 1, CSAT పేపర్ 2. ఈ రెండు పేపర్లు ఒకే రోజు జరుగుతాయి. ఇది స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. అంటే ఈ పరీక్షలో అర్హత సాధిస్తే సరిపోతుంది.
Main Examination (మెయిన్స్)
ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్ రాయవచ్చు. ఈ పరీక్ష మొత్తం 9 పేపర్లకు ఉంటాయి. ఎస్సై రైటింట్, జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్ట్ తదితర అంశాలపై పరీక్ష ఉంటుంది.
ఇంటర్వ్యూ (Personality Test)
మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. వ్యక్తిత్వం, నిర్ణయ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, సమకాలీన అంశాలపై అవగాహనను ఇంటర్వూలో పరీక్షిస్తారు. సాధారణంగా ఐఏస్ పరీక్షలో ఉత్తీర్ణతకు 1 నుంచి 3 సంవత్సరాల క్రమబద్ధమైన సిద్ధత అవసరం. కొందరు డిగ్రీ చదువుతున్నప్పుడే ప్రిపరేషన్ ప్రారంభిస్తారు.




