AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 నుంచి 1 తీసేస్తే 10 వస్తుంది.. ఎలా సాధ్యం? ఈ ఫజిల్‌కు సమాధానం తెలిస్తే షాక్ అవుతారు!

Viral Brain Teaser: 9 నుంచి 1 తీసేస్తే 8 రావాలి. కానీ 10 వస్తుందట! ఇదెలా సాధ్యం? ఈ ఆసక్తికరమైన చిక్కుప్రశ్నకు సమాధానం గణితంలో కాదు, మీ బుర్రతో ఆలోచించి చెప్పాలి. ఇలాంటి ఫజిల్స్‌ మీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. మరి ఈ తెలివైన ట్రిక్ వెనుక ఉన్న పూర్తి కథ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

9 నుంచి 1 తీసేస్తే 10 వస్తుంది.. ఎలా సాధ్యం? ఈ ఫజిల్‌కు సమాధానం తెలిస్తే షాక్ అవుతారు!
Clever Number Riddle
Srilakshmi C
|

Updated on: Jun 10, 2026 | 6:46 PM

Share

చిక్కు ప్రశ్నలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు. ఇవి మన ఆలోచనా శక్తిని, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిక్కు ప్రశ్నలు సాధారణంగా కనిపించినా, వాటి సమాధానాలు భిన్నంగా ఆలోచించాల్సి ఉంటుంది. దీంతో సృజనాత్మకంగా ఆలోచించే అలవాటు పెరుగుతుంది. చిక్కు ప్రశ్నలను పరిష్కరించే ప్రయత్నంలో మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ప్రతి చిక్కు ప్రశ్న వెనుక ఒక తర్కం ఉంటుంది. దానిని గుర్తించడం ద్వారా సమస్యలను వివిధ కోణాల్లో విశ్లేషించే సామర్థ్యం పెరుగుతుంది. పిల్లలను వీటిని అడగడం వల్ల వారి పరిశీలనా శక్తి, భాషా నైపుణ్యాలు, తార్కిక ఆలోచనా విధానం అభివృద్ధి చెందుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఇలాంటి ఆసక్తికర చిక్కు ప్రశ్నలు పంచుకోవడం భలే సరదాగా ఉంటాయి. అలాంటి ఓ ఫజిల్ మీ కోసం..

9కి ఒకటి కలిపితే 10 వస్తుంది. అయితే 9 నుంచి ఒకటి తీసివేసినా 10 రావాలి? ఎలా.. ఈ చిక్కుప్రశ్న మొదట వినగానే ఇది అసాధ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం సాధారణ సంఖ్యల్లో చూస్తే..

9 – 1 = 8 అవుతుంది. మరి 10 ఎలా వస్తుంది?

ఇక్కడే ఈ చిక్కుప్రశ్నలోని అసలు లాజిక్‌ దాగి ఉంది. ఇది గణిత లెక్క కాదు మరి.

ఇవి కూడా చదవండి

రోమన్ సంఖ్యల్లో 9ని IX గా రాస్తాం.. అందులో I (1) ను తీసివేస్తే X మిగులుతుంది. X అంటే 10 అని అర్ధం కదా..!

అందుకే 9 (IX) నుంచి 1 (I) తీసివేసినా 10 (X) వస్తుంది.

సమాధానం దశల వారీగా ఇక్కడ చూద్దాం..

రోమన్ సంఖ్యల్లో

  • 9 అంటే IX
  • 10 అంటే X
  • 1 అంటే I

IX → I తీసేస్తే → X (10) వస్తుంది. అంటే మిగిలేది X.. ఇది రోమన్ సంఖ్యల్లో 10.

అందుకే 9 నుంచి ఒకటి తీసివేసినా 10 వస్తుంది. 9కి ఒకటి కలిపితే 10 వస్తుంది.

అయితే 9 నుంచి ఒకటి తీసివేసినా 10 రావాలి? ఎలా? అనే చిక్కుప్రశ్న గణిత లెక్క కాదు, రోమన్ సంఖ్యల ఆధారంగా ఉన్న ఒక తెలివైన చిక్కుప్రశ్న. చిక్కు ప్రశ్నలు మెదడుకు పదును పెట్టే ఉత్తమ సాధనాలు. ఇవి వినోదాన్ని అందించడమే కాకుండా, ఆలోచనా సామర్థ్యం, తార్కికత, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. ఇలాంటి కఠినమైన చిక్కు ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతారు.

Follow Us