AP Crime news: ఎంతకూ తెగని అన్నదమ్ముల ఆస్తివివాదం! పట్టరాని కోపంతో మధ్యవర్తులపై కత్తులతో దాడి.. ఆ తర్వత ఏమైందంటే..

అన్నదమ్ముల మధ్యఆస్తి పంపకం వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తులపై విచక్షణా రహితంగా కత్తులతో దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..

AP Crime news: ఎంతకూ తెగని అన్నదమ్ముల ఆస్తివివాదం! పట్టరాని కోపంతో మధ్యవర్తులపై కత్తులతో దాడి.. ఆ తర్వత ఏమైందంటే..
Ap Crime News
Follow us

|

Updated on: Sep 15, 2022 | 7:35 PM

Andhra Pradesh Crime News: అన్నదమ్ముల మధ్యఆస్తి పంపకం వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తులపై విచక్షణా రహితంగా కత్తులతో దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రానికి చెందిన శనివరపు హరికృష్ణ, శ్రీనివాసులు అన్నదమ్ములు. ఇటీవల వీరి తల్లి మరణించింది. దీంతో ఆస్తి పంపకాల విషయంలో గత కొంత కాలంగా గొడవ అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో వీరికి సర్ది చెప్పేందుకు అదే ఊరికి చెందిన నాగిశెట్టి మధు, పాలంకి మధు, పాలంకి లక్ష్మణ్‌, సురేశ్‌ అనే మధ్యవర్తులు పంచాయితీలో పెద్దలుగా వ్యవహరించారు. అయితే సదరు పంచాయితీలో తనకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నావంటూ సెప్టెంబర్‌ 14 రాత్రి శనివరపు హరికృష్ణ, అతని కుమారుడితో కలిసి నాగిశెట్టి మధుపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. మధ్యలో అడ్డువచ్చారని పాలంకి మధు, పాలంకి లక్ష్మణ్‌, సురేశ్‌లపై కూడా వీరు దాడి చేశారు. దీంతో మధ్యవర్తిత్వం వహించి నందుకుగానే నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రగాయాలపాలైన వీరిని స్థానికులు సమీసంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసునమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసధికారి ఒకరు తెలిపారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన