AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress: జాతకాల కోసమే నెలకు 10 వేలు ఖర్చు చేస్తా.. సీరియల్ హీరోయిన్..

ప్రస్తుతం తెలుగులో ఓ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన నటి.. తన కెరీర్ నిర్ణయాల కోసం జ్యోతిష్యాన్ని ఎంతగానో నమ్ముతానని వెల్లడించారు. తెలుగులో అంతకు ముందు వచ్చిన రెండు ప్రాజెక్టులలో ఏది ఎంచుకోవాలో తెలియక, ఆమె అనేక మంది జ్యోతిష్యులను సంప్రదించి, నెలకు పదివేల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు చెప్పకొచ్చింది. జ్యోతిష్యుల సలహాలు తన జీవితంలో నిజమయ్యాయని బలంగా నమ్ముతున్నట్లు వెల్లడించారు.

Serial Actress: జాతకాల కోసమే నెలకు 10 వేలు ఖర్చు చేస్తా.. సీరియల్ హీరోయిన్..
Deepika Rangaraju
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2026 | 11:27 AM

Share

బ్రహ్మముడి సీరియల్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందిన నటి దీపిక రంగరాజు. తన నటన, చలాకీతనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. సంవత్సరాలుగా సాగుతున్న ఈ సీరియల్ ఇప్పటికీ అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇందులో అచ్చమైన తెలుగమ్మాయిల కనిపిస్తూ తన నటనతో ప్రశంసలు అందుకుంటుంది. అలాగే సీరియల్ మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ నిర్ణయాలలో జ్యోతిష్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆ కార్యక్రమంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. బ్రహ్మముడి సీరియల్ ప్రారంభానికి ముందు, దీపికకు రెండు వేర్వేరు ప్రాజెక్టుల నుండి అవకాశాలు వచ్చాయి. ఒకటి హీరోయిన్ రీప్లేస్‌మెంట్ ప్రాజెక్ట్ కాగా, మరొకటి కొత్త సీరియల్ అని.. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలో తీవ్ర సందిగ్ధంలో ఉన్న దీపిక, అనేక మంది జ్యోతిష్యులను సంప్రదించినట్లు తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

తన కెరీర్ భవిష్యత్తును తెలుసుకునేందుకు ఆమె జ్యోతిష్యులకు ఫోన్ చేసి, అపాయింట్‌మెంట్లు తీసుకొని మాట్లాడినట్లు వివరించారు. నెలకు పదివేల రూపాయల వరకు జ్యోతిష్య సలహాల కోసం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కువ మంది జ్యోతిష్యులు బ్రహ్మముడి సీరియల్ చేయమని సలహా ఇచ్చినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. దేవుడు రాసి పెట్టినట్లుగానే చివరకు బ్రహ్మముడి సీరియల్‌కు ఎంపికైనట్లు దీపిక తెలిపారు. గతంలో జ్యోతిష్యులు చెప్పిన అనేక విషయాలు తన జీవితంలో నిజమయ్యాయని, నాలుగు-ఐదు సంవత్సరాల ముందే ఒక జ్యోతిష్యుడు తాను ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత వెలుగులోకి వస్తానని చెప్పారని, అది బ్రహ్మముడి ద్వారా నిజమైందని దీపిక రంగరాజు అన్నారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

తమిళనాడుకు చెందిన ఈ ముద్దుగుమ్మ కాలేజీ రోజుల్లోనే నాటకాలపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట తాను ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేసింది. ఆ తర్వాత తమిళంలో ‘ఆరడి’ అనే సినిమా ద్వారా నటిగా మారారు. తమిళంలో పలు సీరియల్స్ చేసిన దీపిక ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

దీపిక రంగరాజు పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us
కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..
కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..
చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. కానీ
చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. కానీ
డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే ..
డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ ఆవకాయ..
సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ ఆవకాయ..
పొట్టి ఫార్మాట్‌లో దండుపాళ్యం బ్యాచ్.. బ్యాట్ పట్టాలంటేనే వణుకు..
పొట్టి ఫార్మాట్‌లో దండుపాళ్యం బ్యాచ్.. బ్యాట్ పట్టాలంటేనే వణుకు..
ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ
ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!
చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!