AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi: ‘ఇరుముడి’ సినిమాతో జాక్ పాట్ కొట్టిన రవితేజ.. రెమ్యునరేషన్ తగ్గినా కోట్లలో లాభాలు.. ఎలాగంటే?

గత శుక్రవారం (ఆగస్టు 21) రిలీజైన రవితేజ 'ఇరుముడి' సినిమా భారీ వసూళ్లు రాబట్టుతోంది. పాజిటివ్ రివ్యూలకు తోడు మౌత్ టాక్ కూడా అద్భుతంగా ఉండడంతో రవితేజ సినిమాకు తిరుగులేకుండా పోయింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 75 కోట్లకు చేరువలో ఉంది.

Irumudi: 'ఇరుముడి' సినిమాతో జాక్ పాట్ కొట్టిన రవితేజ.. రెమ్యునరేషన్ తగ్గినా కోట్లలో లాభాలు.. ఎలాగంటే?
Irumudi Movie
Basha Shek
|

Updated on: Aug 23, 2026 | 7:00 PM

Share

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న మాస్ మహారాజా రవితేజకు ఇరుముడి రూపంలో బిగ్ రిలీఫ్ లభించింది. గత శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది. ఇప్పటికే రవితేజ సినిమా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చాలా చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను సాధించి లాభాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ సినిమా ట్రెండ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కు డివోషనల్ టచ్ ఇచ్చి ఈ సినిమాను అద్భతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ శివ నిర్వాణ. అందుకు తగ్టట్టే థియేటర్లలో ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. అన్నిటికీ మించి రవితేజకు గ్రేట్ కమ్ బ్యాక్ వచ్చినట్టేనని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇరుముడి సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం మాస్ మహారాజా చాలా తక్కువగానే పారితోషికం తీసుకున్నాడట. సాధారణంగా అందుకునే రెమ్యునరేషన్ లో కేవలం మూడో వంతు మాత్రమే తీసుకున్నాడట. అయితే తెలుగు సినిమాలకు బలమైన మార్కెట్ గా చెప్పుకునే నైజాం థియేట్రికల్ హక్కులు రవితేజనే తీసుకున్నాడట.

ప్రస్తుతం ఇరుముడి సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో రవితేజకు రెగ్యులర్ గా వచ్చే రెమ్యునరేషన్ కంటే అధికంగానే డబ్బులు రానున్నాయట. సుమారు రూ.30 కోట్ల వరకు రవితేజకు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇరుముడి సినిమా విషయానికి వస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే బేబీ నక్షత్ర, సాయికుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

ఇరుముడి సినిమాకు ఆడియెన్స్ రెస్పాన్స్..

ఇరుముడి మల్లెపూల పల్లకి సాంగ్..

ఇరుముడి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమై
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమై
వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో చిరంజీవి సినిమా.. కట్ చేస్తే..
వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో చిరంజీవి సినిమా.. కట్ చేస్తే..
తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు..
తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు..
చికెన్ మటన్‌ కంటే బెస్ట్..ఇలా ఎండు చేపల పులుసు చేస్తే అదిరిపోద్దీ
చికెన్ మటన్‌ కంటే బెస్ట్..ఇలా ఎండు చేపల పులుసు చేస్తే అదిరిపోద్దీ
నేవీలో హనీట్రాప్.. అధికారి అరెస్ట్! రిస్క్‌లో విశాఖ భద్రతాసమాచారం
నేవీలో హనీట్రాప్.. అధికారి అరెస్ట్! రిస్క్‌లో విశాఖ భద్రతాసమాచారం