Road Accident: ఘోర ప్రమాదం..! ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినులపైకి 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు.. అక్కడికక్కడే..

ఐటీ కారిడార్‌లో రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్తోకెళ్తే..

Road Accident: ఘోర ప్రమాదం..! ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినులపైకి 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు.. అక్కడికక్కడే..
Road Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 15, 2022 | 8:22 PM

Chennai Crime News: ఐటీ కారిడార్‌లో రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్తోకెళ్తే.. చెన్న్తైలోని హెచ్‌సిఎల్ స్టేట్ స్ట్రీట్ సర్వీస్‌లో తిరుపతికి చెందిన ఎస్ లావణ్య (23), కేరళకు చెందిన ఆర్ లక్ష్మి (24) అనలిస్టులుగా పనిచేస్తున్నారు. ఈ ఐటీ కారిడార్‌లో కంపెనీలు అధికంగా ఉండటం వల్ల రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఈ క్రమంలో లావణ్య, లక్ష్మి బుధవారం రాత్రి 11 గంటల 30 నిముషాలకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా చెన్నైలోని ఓఎంఆర్‌ వద్ద అటుగా వస్తున్న కారు అదుపుతప్పి వాకిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలపాలైన లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కారు అదుపుతప్పడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కారు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ మోతేష్‌ కుమార్‌ (20)ను పోలీసులు అరెస్టు చేసినట్లు తాంబరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎమ్‌ఆర్‌ జీకే కన్నన్ తెలిపారు.

రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్‌లు లేకపోవడంతో పాదచారులు తరచూ ప్రమాదాలకు గురౌతున్నారని, ట్రాఫిక్‌ మధ్యలో రోడ్లు దాటడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిగ్నల్ సేఫ్టీతో జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేయాలని, పాదచారులకు ఓవర్‌హెడ్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే