బీపీతో ఇబ్బందిపడుతున్నారా? రక్తపోటు అదుపులో పెట్టే ఫుడ్స్ ఇవే
10 June 2026
Pic credit - Instagram
Phani Ch
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా బీపీతో బాధపడుతున్నారు. ఎక్కువగా యువత బీపీతో సతమతమవుతున్నారు.
రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నట్టు తాజా అధ్యయనాల్లో తేలింది. మనం తీసుకునే ఆహారం, జీవనశైలితో ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
అరటిపండులోనూ పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. 1600 మందిపై నిర్వహించిన అధ్యయనాల్లో పొటాషియం ఎక్కువగా తీసుకున్నవారిలో బీపీ అదుపులో ఉందని తేలింది.
రక్తపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో పచ్చి ఉల్లిపాయలు చేర్చుకోవాలి. దీనిలో ఉండే అడెనోసిన్ అనే రసాయనం వల్ల కండరాలు రిలాక్స్ అవడమే కాకుండా బీపీ అదుపులోకి వస్తుంది.
కొబ్బరి నీళ్లలో కాల్షియం, విటమిన్ సితోపాటు మరెన్నో మినరల్స్ ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం బీపీని అదుపులోకి తీసుకొచ్చేందుకు తోడ్పడుతుంది.
బీపీని అదుపులో ఉంచే మరో మంచి ఔషధఫలం పుచ్చకాయ. ఇందులో ఉండే అమైనో ఆసిడ్లు రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
తరచూ పుచ్చకాయను తీసుకోవడం వలన మెదడులో రక్తం గడ్డకట్టడం, గుండెపోటువంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
కొత్తిమీరలో యాంటీడిప్రెసెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ యాంగ్జైటీ లక్షణాలను కలిగించే రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడతాయి.
పుదీనాలో ఉండే పోషకాలు గుండెకి రక్తాన్ని అందించే దమనులు మూసుకుపోకుండా అడ్డుకుంటాయి. దీనిద్వారా గుండెకు రక్త సరఫరా పెరిగి హృదయ స్పందనలు సాధారణ స్థితిలోకి వస్తాయి.
నిమ్మకాయలో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటుకి కారణమయ్యే సోడియంపై ప్రభావం చూపుతుంది.