- Telugu News Lifestyle Drumstick Benefits: Drumstick helps you stay young and That Can Help You Look Younger
Anti Aging Food: నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? ఇంటి పెరట్లో పెరిగే ఈ కూరగాయను తినండి..
మునగ కాయల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి సంరక్షించడంలో సహాయపడుతుంది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది..
Updated on: Sep 15, 2022 | 6:56 PM

మునగ కాయల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి సంరక్షించడంలో సహాయపడుతుంది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.

మునగకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం తగ్గుముఖం పడుతుంది. మునగ ఆకులు, పువ్వులు ఎండబెట్టి, మెత్తగా చేసుకుని సలాడ్లు, సూపుల్లో ఉపయోగించవచ్చు.

మునగ ఆకులను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు కళ్లెం వేయవచ్చు. మునగ ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, జింక్, ఇతర పోషకాలు క్యాన్సర్, ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి.

మునగలో యాంటీఅల్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది అల్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.

మలబద్ధకంతో బాధపడే పిల్లలకు మునగతో తయారు చేసిన సూప్ తాగించడం వల్ల జీవక్రియను వేగవంతం చేస్తుంది.




