AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో మధుమేహానికి సులువుగా చెక్‌ పెట్టొచ్చు తెలుసా?

Diabetes Diet: మధుమేహం బాధితులు లైఫ్‌స్టైల్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. పోషకాహారం తీసుకోవడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే.

Diabetes: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో మధుమేహానికి సులువుగా చెక్‌ పెట్టొచ్చు తెలుసా?
Diabetes
Basha Shek
|

Updated on: Sep 15, 2022 | 7:05 PM

Share

Diabetes Diet: మధుమేహం బాధితులు లైఫ్‌స్టైల్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. పోషకాహారం తీసుకోవడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే. అలాగే సరైన నిద్ర, శారీరక శ్రమతో పాటు ముందులు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ను అదుపులో ఉంచవచ్చు. కాగా మధుమేహం చికిత్సలో ఆయుర్వేదం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వంటగదిలో లభించే పలు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. మనం చేయాల్సిందల్లా వాటిని సరైన సమయంలో, సరైన మార్గంలో తీసుకోవడమే. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

మెంతులు

ఇది రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఊబకాయం, కొలెస్ట్రాల్‌ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. గ్లూకోస్ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

దాల్చిన చెక్క

 దాల్చిన చెక్క ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. అలాగే భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో అదనపు కొవ్వులను కరిగించడంలో కూడా సమర్థంగా పనిచేస్తుంది.

అల్లం

అల్లంలో యాంటీ డయాబెటిక్, హైపోలిపిడెమిక్, యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడుతాయి. అలాగే రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. అయితే డాక్టర్ సలహా మేరకు అల్లంను మితంగా తీసుకోవాలి.

బ్లాక్ పెప్పర్

ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా నల్ల మిరియాల్లోని పైపెరిన్‌ రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థాయిలో నిర్వహించడంలో సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న వివరాలు కేవలం సమాచారం కోసమే. ఇందులోని పద్ధతులు, చిట్కాలు పాటించాలనుకుంటే, కచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..