Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను హత్యకు ప్లాన్ బీ.. పోలీసుల విచారణలో షాకింగ్ డీటెయిల్స్..
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ బీని కూడా సిద్దం చేసినట్టు తెలుస్తోంది.
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ బీని కూడా సిద్దం చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్ సభ్యుడు కపిల్ పండిట్‌ను విచారించినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవును, బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను నీడలా వెంటాడుతోంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. పంజాబ్ సింగర్ మూసేవాలా మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న పంజాబ్, ఢిల్లీ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ బీని కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం పాక్ సరిహద్దులో ఢిల్లీ-పంజాబ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు కపిల్ పండిట్ పట్టుబడ్డాడు. కపిల్ పండిట్‌ను విచారించినప్పుడు సల్మాన్ మర్డర్ ప్లాన్‌ను వివరించాడు. ఇంటి దగ్గర కాకపోతే సల్మాన్‌ను ఫాంహౌస్ దగ్గర హత్య చేయాలని ప్లాన్ చేసింది బిష్ణోయ్ గ్యాంగ్.
ముంబై శివార్లలోని పన్వేల్‌లో సల్మాన్‌కు విశాలమైన ఫాంహౌస్ ఉంది. సెలవు రోజుల్లో , వీకెండ్స్‌ల్లో ఎక్కువగా ఇక్కడే ఆయన గడుపుతారు. లాక్‌డౌన్ సమయంలో పూర్తిగా ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారు సల్మాన్. అక్కడైతే ఈజీగా తమ ప్లాన్ అమలు చేయవచ్చని రెక్కీ నిర్వహించారు. సల్మాన్ ఫాంహౌస్ సమీపంలో రెండు నెలల పాటు ఆ గ్యాంగ్ తిష్టవేసింది. ఆయుధాలను , వాహనాలను కూడా సిద్దం చేసుకున్నారు.
హిట్ అండ్ రన్ కేసు తరువాత సల్మాన్‌ఖాన్ కారు చాలా స్లోగా వెళ్తున్న విషయాన్ని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముందుగానే గమనించింది. అంతేకాకుండా ఫాంహౌస్‌కు వచ్చే సమయంలో ఆయనతో పాటు ఒక్కడే బాడీగార్డ్ షేరా ఉంటాడని తెలుసు. ఈజీగా సల్మాన్‌పై కాల్పులు జరపవచ్చని అనుకున్నారు. సల్మాన్‌ఖాన్ కారు ఫాంహౌస్‌కు వెళ్లే సమయంలో గుంతల దగ్గర స్లో అవుతుందని దాడి అక్కడే దాడి చేయవచ్చని ప్లాన్ రచించారు.
గత మే నెలలో సిద్దూ మూసేవాలాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. అంతకుముందే ఏప్రిల్‌లో సల్మాన్ హత్యకు రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌లో రెండుసార్లు తన ఫాంహౌస్‌కు వచ్చారు సల్మాన్.అయినప్పటికి మాఫియా దాడి నుంచి ఆయన తప్పించుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..