AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Casting Couch: దర్శక నిర్మాతలతో అలా ఉంటనే ఆఫర్లు.. బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై నటి సంచలన కామెంట్స్

Shama Sikander: సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. చూడడానికి అంతా కలర్‌ఫుల్‌గా ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే ఇదంతా నాణెనికి ఒకవైపే. మరోవైపు బయటకి కనిపించని ఎన్నో చీకటి విషయాలు ఉంటాయి.

Casting Couch: దర్శక నిర్మాతలతో అలా ఉంటనే ఆఫర్లు.. బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై నటి సంచలన కామెంట్స్
Shama Sikander
Follow us
Basha Shek

|

Updated on: Sep 16, 2022 | 12:37 PM

Shama Sikander: సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. చూడడానికి అంతా కలర్‌ఫుల్‌గా ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే ఇదంతా నాణెనికి ఒకవైపే. మరోవైపు బయటకి కనిపించని ఎన్నో చీకటి విషయాలు ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కైచ్‌, కమిట్మెంట్‌ కల్చర్‌పై ఇప్పటికే చాలామంది నటీమణులు ఓపెన్‌ అయ్యారు. ముఖ్యంగా మీటూ ఉద్యమం వచ్చాక కాస్టింగ్ కౌచ్ బాధితులు ఒక్కొక్కరూ ముందుకొస్తున్నారు. సినిమా అవకాశాల కోసం తాము ఎలాంటి భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నామో ధైర్యంగా పంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో నటి చేరింది. ఆమె ష‌మా సికంద‌ర్. యే మేరి లేఫ్‌ హై, మన్‌ మే హై విశ్వాస్‌ వంటి టీవీ సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు పొందిందీ అందాల తార. ‘మన్‌’తో సిల్వర్‌స్ర్కీన్‌కు పరిచయమై బైపాస్‌ రోడ్‌ సినిమాలోనూ నటించి మెప్పించింది. సోషల్‌ మీడియాలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందమైన జీవితం వడ్డించిన విస్తరేమి కాదంటోంది.

గతంలో ఉన్నట్లు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు యువ డైరెక్టర్లు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. నటీనటులకు చాలా గౌరవం, మర్యాదలు ఇస్తున్నారు. గతంలో పేరున్న కొందరు దర్శక నిర్మాతలు మాకు ఆఫర్స్ కావాలంటే వారితో బెడ్ షేర్ చేసుకోమని అడిగేవారు. కొంతమందైతే వాళ్లతో సినిమాలు చేయకపోయినా తమతో సన్నిహితంగా ఉండాలని కోరేవారు. వారి మాటలు నాకు ఆశ్చర్యంగా అనిపించేవి. కలిసి పని చేయనప్పుడు స్నేహంగా ఎలా ఉంటామని అడిగేదాన్ని. కొంతమందైతే ఇలా ఎదురు ప్రశ్నిస్తే వేరే ఎక్కడా కూడా ఆఫర్స్ రాకుండా చేస్తాం అని బెదిరించేవారు. నేను కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. కానీ ఇప్పుడు సినిమా పరిశ్రమ అలా లేదు. గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సేఫ్’ అని తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చిందీ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. ప్రస్తుతం షమా సికిందర్‌ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..