AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandez : బాలీవుడ్ బ్యూటీ మెడకు బిగిసుకుంటోన్న ఉచ్చు..అన్నీ తెలిసే జాక్వెలిన్ అతడిని పెళ్లి చేసుకోవాలనుకుందా ?..

కానీ జాక్వెలిన్ సుకేష్ చంద్రబోస్ ను డ్రీమ్ బాయ్‏గా భావించిందని.. అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను సుకేష్ తనను పెళ్లి చేసుకునేందుకు

Jacqueline Fernandez : బాలీవుడ్ బ్యూటీ మెడకు బిగిసుకుంటోన్న ఉచ్చు..అన్నీ తెలిసే జాక్వెలిన్ అతడిని పెళ్లి చేసుకోవాలనుకుందా ?..
Jacqueline
Rajitha Chanti
|

Updated on: Sep 17, 2022 | 12:28 PM

Share

బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez).. నోరా ఫతేహి మనీలాండరింగ్ కేసులో చిక్కుకుని బయటకు రాలేక విలవిలలాడిపోతున్నారు. ఈడీ విచారణలో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఢిల్లీ పోలీసుల విచారణలో పలు విషయాలు బయట పడుతున్నాయి. దీంతో వీరిద్దరి మరింత ఉచ్చు బిగుస్తోంది. రూ. 200 కోట్ల దోపిడీ, మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రభోస్‏తో వీరికి సంబంధం ఉన్నట్లుగా ఈడీ చార్జీ షీట్ ధాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల వీరిద్దరిని విచారించింది ఈడీ. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ కేసులో జాక్వెలిన్, నోరా ఫతేహికి ప్రత్యక్ష సంబంధం లేదని పేర్కొంది ఈడీ. కానీ జాక్వెలిన్ సుకేష్ చంద్రబోస్ ను డ్రీమ్ బాయ్‏గా భావించిందని.. అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను సుకేష్ తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పించాడని.. అతడి గురించి వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా సుకేష్ తో జాక్వెలిన్ టచ్‏లో ఉందని తెలిపారు పోలీసులు. అయితే సుకేష్ ప్రవర్తన పై అనుమానం వచ్చిన నోరా ఫతేహి అతనితో డిస్ కనెక్ట్ అయ్యిందని.. అతడికి దూరంగా ఉంటుందని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్ యాదవ్ తెలిపారు.

అంతేకాకుండా.. జాక్వెలిన్ మేనేజర్ ప్రశాంత్ నుంచి దాదాపు 8 లక్షల విలువైన బైక్ స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఈ బైక్‏ను సుకేష్ బహుమతిగా ఇచ్చినట్లు నిర్దారించారు. అయితే నోరా ఫతేహి ఎప్పుడు సుఖేష్ చంద్రశేఖర్ ను వ్యక్తిగతంగా కలవలేదని.. కేవలం అతనితో వాట్సాప్‏లో రెండు సార్లు మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. నోరా ఫతేహితోపాటు.. ఆమె బావమరిది మెహబూబ్ అకా బాబీ ఖాన్, పింకీ ఇరానీని సుకేష్ చంద్రబోస్‏కు కంటాక్ట్ అయ్యారు. వీరికి ఖరీదైన బహుమతులు అందించినట్లుగా తెలుస్తోంది. అలాగే.. సుకేష్, లీనా మరియా యాజమాన్యంలోని చెన్నై స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమానికి నోరా ఫతేహి హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం, బీఎండబ్ల్యూ కారు ఆఫర్ చేశారు. కానీ వీటిని నోరా ఫతేహి రిజెక్ట్ చేసిం..వాటిని మెహబూబ్ అకా బాబీ ఖాన్‏కు ఇవ్వాలని తెలిపింది. మొత్తానికి ఈ మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ కు మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

Follow Us
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..