Urvashi Rautela: ఐఏఎస్ కావాలనుకుంది.. రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.. వన్నె తగ్గని అందం, చల్లని మనసు ఈమె సొంతం
Surya Kala | Edited By: Basha Shek
Updated on: Sep 16, 2022 | 11:34 AM
ఇటీవల క్రికెటర్ రిషబ్ పంత్ తో వివాదంతో ఊర్వశి రౌతేలా వార్తల్లో నిలిచింది. అయితే ఈ నటి ఐఏఎస్ కావాలనుకుంటోందని చాలా తక్కువ మందికి తెలుసు. అందమే కాదు.. తెలివి తేటలు ఊర్వశి రౌతేల సొంతం.. ఈరోజు ఊర్వశి క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం.
Sep 16, 2022 | 11:34 AM
ఊర్వశి రౌతేలా భారత్ తరఫున 2015లో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. సినిమా నటి, మోడల్ ఊర్వశి రౌతేలా ఇటీవల క్రికెటర్ రిషబ్ పంత్‌తో వివాదంతో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఈ వివాదాన్ని పక్కన పెడితే ఊర్వశి తన అందంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఊర్వశి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిజానికి ఈ నటి కల ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంది. ఈ నేపథ్యంలో ఊర్వశి విద్యార్హత ఏమిటో తెలుసుకుందాం.
1 / 9
ఊర్వశి రౌతేలా ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో ఉన్న DAV స్కూల్‌లో చదువుకుంది. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక ఊర్వశి ఢిల్లీలోని గార్గి కాలేజీలో పట్టభద్రురాలైంది. ఢిల్లీ యూనివర్శిటీ గార్గి కళాశాల కేవలం బాలికలకు మాత్రమే. ఇక్కడ అడ్మిషన్ కూడా చాలా కష్టం.
2 / 9
ఊర్వశి మొదట్లో ఇంజినీరింగ్ చేయాలనుకుంది. తన కలను నెరవేర్చుకోవడానికి IIT ప్రవేశ పరీక్ష JEEకి కూడా సిద్ధమయ్యింది. దీనిని అప్పుడు AIEEE అని పిలిచేవారు. అయితే ఊర్వశి కన్న కల వేరు.. విధి రాసింది వేరు.. దీంతో ఊర్వశి అదృష్టం కూడా మారింది.
3 / 9
అందాల భామ ఊర్వశి మిస్ దివా యూనివర్స్‌లో పాల్గొనడంతో ఆమె కెరీర్ మారింది. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, ప్రజలు ఊర్వశి గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. బీ టౌన్ తలపులు తెరచింది. నటిగా అనేక సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
4 / 9
ఊర్వశి మీడియాతో మాట్లాడుతూ.. తాను నటిని కాకపోతే, ఈ రోజు ఏరోనాటికల్ ఇంజనీర్ లేదా ఐఎఎస్ ఆఫీసర్ అయ్యేదానినని.. ఒకప్పుడు చెప్పింది. ఊర్వశి నటనతో పాటు క్రీడల్లోనూ రాణించింది. జాతీయ స్థాయి వరకు బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి కూడా..
5 / 9
బాలీవుడ్‌లోకి ప్రవేశించే ముందు ఊర్వశి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూయార్క్‌లో శిక్షణ కూడా తీసుకుంది. ఆమె భరతనాట్యం, కథక్, బ్యాలెట్, కాంటెంపరరీ బెల్లీ, హిప్ హాప్, బ్రాడ్‌వే జాజ్ వంటి అనేక రకాల డ్యాన్స్ ల్లో శిక్షణ పొందింది
6 / 9
ఊర్వశి రౌతేలా అందగత్తె మాత్రమే కాదు.. అందమైన మనసు కలిగిన నటి కూడా.. ఫ్యాషన్ రంగంలో మోడల్ గా తనదైన ముద్ర వేసింది. ఎన్నో అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. 2011 సంవత్సరంలో ఊర్వశికి 'మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్', 'మిస్ ఏషియన్ సూపర్ మోడల్' అవార్డులను అందుకుంది. 2015లో 'మిస్ దివా' మరియు 'మిస్ యూనివర్స్ ఇండియా' టైటిల్స్ గెలుచుకుంది
7 / 9
ఊర్వశి రౌతేలా విద్య, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో ప్రజలకు సహాయపడేలా 'ఊర్వశి రౌతేలా ఫౌండేషన్' అనే సంస్థను కూడా నడుపుతోంది. 28 ఏళ్ల బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా 1994 ఫిబ్రవరి 15న ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో జన్మించింది.
8 / 9
ఊర్వశి కుటుంబం నేపధ్యంలోకి వెళ్తే.. ఆమె తండ్రి మన్వర్ సింగ్ రౌతేలా ఒక వ్యాపారవేత్త. గర్వాల్‌కు చెందినవారు. ఊర్వశి తల్లి మీరా రౌతేలా కుమావోని.. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో ఒక ప్రసిద్ధ బ్యూటీ పార్లర్ యజమాని. ఊర్వశి తమ్ముడు యష్‌రాజ్ రౌతేలా దుబాయ్‌లో శిక్షణ పొంది ప్రస్తుతం ఎయిర్‌లైన్స్‌లో కెప్టెన్‌గా విధులను నిర్వహిస్తున్నారు.