Nagarjuna: చైతన్య- సమంత విడిపోవడం పై మరోసారి స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే
మొన్నటివరకు మోస్ట్ లవబుల్ కపుల్ గా ఉన్న నాగచైతన్య, సమంత.. విడిపోయి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడాకులు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.
మొన్నటివరకు మోస్ట్ లవబుల్ కపుల్ గా ఉన్న నాగచైతన్య, సమంత.. విడిపోయి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడాకులు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక విడిపోయిన తర్వాత ఎవరి పనులతో వారు బిజీగా ఉన్నారు. సామ్ కొద్దిరోజులు సోషల్ మీడియాలో మోటివేషన్ కొటేషన్స్ పెట్టింది. అలాగే విహారయాత్రలు అంటూ హంగామా చేసింది. ఆ తర్వాత అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ కూడా చేసింది. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. అటు నాగచైతన్య కూడా తన సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. విడిపోయిన దగ్గర నుంచి ఈ ఇద్దరూ మీడియా ముందు విడిపోవడానికి కారణాలు ప్రస్తావించలేదు.
అయితే నాగ చైతన్య, సమంత విడిపోయిన తర్వాత ఈ ఇద్దరి గురించి చాలా వార్తలు పుట్టుకొచ్చాయి వచ్చాయి.. సామ్ దే తప్పు అని కొందరు.. చైతూదే తప్పు అని మరికొందరు కామెంట్స్ కూడా చేశారు. అయితే తాజాగా నాగచైతన్య లైఫ్ గురించి కింగ్ నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంట్రవ్యూలో చైతూ పై వస్తున్న వార్తల పై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా.. నాగార్జున స్పందిస్తూ.. చైతన్య ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. నాకు అది చాలా సంతోషాన్నిస్తుంది. పెళ్లి చేసుకొని విడిపోవడం దురదుష్టకరమే.. దాన్ని ఒక అనుభవంగా తీసుకోవాలి.. దాని గురించే ఆలోచించకూడదు. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. ప్రజలు కూడా ఈ విషయాన్ని మర్చిపోతారని అనుకుంటున్నా.. అని నాగార్జున చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తలు ఇక్కడ చదవండి