Salman Khan: మెగాస్టార్ మూవీ కోసం సల్మాన్ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
మెగాస్టార్ సినిమా కోసం అయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ ఆచార్య నిరాశపరచడంతో ఇప్పుడు గాడ్ ఫాదర్ పై భారీ అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్.
మెగాస్టార్ సినిమా కోసం అయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ ఆచార్య నిరాశపరచడంతో ఇప్పుడు గాడ్ ఫాదర్(Godfather) పై భారీ అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్. మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయినా ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అంతే కాదు ఈ సినిమాలో మెగాస్టార్, సల్మాన్ కలిసి ఓ పాటలో కూడా కనిపించున్నారు. దాంతో ఈ సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో సల్మాన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా కోసం సల్మాన్ రెమ్యునరేషన్ భారీ అందుకున్నడని తెలుస్తోంది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న సల్మాన్ అక్కడ ఒకొక్క సినిమాకు దాదాపు 100 కోట్ల వరకు అందుకుంటున్నాడు. ఇక గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఏకంగా 40 కోట్ల వరకు అందుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు కాబట్టి అక్కడ కూడా ఈ సినిమా మంచి మార్కెట్ ను క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సిస్టర్ పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
మరిన్ని సినిమా వార్తలు చదవండి