Bigg Boss 6 Telugu: “కళ్ళముందే అమ్మ కాలిపోయింది.. పాప గుండె కొట్టుకోలేదు”.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6 Telugu) రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లో ప్రస్తుతం ఉన్న 21మంది కంటెస్టెంట్స్ పోటీపడుతూ గేమ్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు.

Bigg Boss 6 Telugu: కళ్ళముందే అమ్మ కాలిపోయింది.. పాప గుండె కొట్టుకోలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్
Bigg Boss Telugu 6
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 15, 2022 | 4:25 PM

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6 Telugu) రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లో ప్రస్తుతం ఉన్న 21మంది కంటెస్టెంట్స్ పోటీపడుతూ గేమ్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు. గొడవలు ఏడుపులు, మధ్య మధ్యలో గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు, ఆ టాస్క్ లలో జరిగే రచ్చ మాములుగా లేదు. ఇక హౌస్లో ఉన్న వాళ్లలో కొంతమంది చేసే ఓవర్ యాక్షన్ కారణంగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గీతూ చేసే గాలట చాలా మందికి చిరాకు తెప్పిస్తోంది. ఇక రెండో వారంలో సిసింద్రీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రేవంత్, గీతూ మధ్య చిన్న పాటి యుద్ధమే జరిగింది. ఇక ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటై  నేటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగిందని తెలుస్తోంది.

నేటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అంతా పిల్లలతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. ముందుగా సుధీప మాట్లాడుతూ.. తన కడుపులోనే పాప చనిపోయిందని.. ఆతర్వాత తన చెల్లెలి పాపను పెంచుకున్నాం అని కానీ తాను మమల్ని వెళ్ళిపోతుందని తెలిస్తే చాలా భాద అనిపించేది. ప్రాణం పోయినట్టు ఉండేది అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన భార్య 7 నెలల గర్భిణీ అని చిన్న తనం నుంచి నాన్న అనే పిలుపుకు నోచుకోలేదని.. ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తున్నా అని అన్నాడు. అలాగే బిగ్ బాస్ కు వచ్చే ముందే తన పాప చనిపోయిందని.. కచివరి చూపుకు కూడా నోచుకోలేదని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది కీర్తి. అలాగే బిగ్ బాస్ కపుల్ మెరీనా, రోహిత్ మాట్లాడుతూ.. మూడు నెలలతర్వాత పాపకు హాట్ బీట్ లేదని.. వేరే ఆప్షన్ లేక బేబీని తీసేశారని చెప్పి ఏడ్చేశారు. ఇక ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే చలాకీ చంటి కూడా తన జీవితంలో జరిగిన విషాదన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. తన కాళ్ళ ముందే తన తల్లి ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు చాలా ఏడ్చా నా ఏడుపు గ్రహించాడేమో.. మా అమ్మను ఇద్దరిగా ఇచ్చాడు అన్నారు చంటి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్