Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పాతబస్తీలో మళ్లీ రౌడీ గ్యాంగ్‌ల హల్‌చల్‌.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి రౌడీ షీటర్ దారుణహత్య

అసద్‌ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని చెల్లెలి కూతురు భర్త బాబూఖాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే తాను తప్పుడు సాక్ష్యం చెప్పనని చెప్పడంతో నిన్న రాత్రి దారుణంగా హతమార్చారు.

Telangana: పాతబస్తీలో మళ్లీ రౌడీ గ్యాంగ్‌ల హల్‌చల్‌.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి రౌడీ షీటర్ దారుణహత్య
Murder
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 15, 2022 | 2:00 PM

Telangana: పాతబస్తీలో నడిరోడ్డుపై రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. హసన్‌నగర్‌లో బాబూఖాన్‌ని ప్రత్యర్థులు పొడిచి చంపేశారు. ఓ హోటల్ ముందు అందరూ చూస్తుండగా కత్తులతో దాడి చేశారు. దీంతో రౌడీషీటర్‌ బాబూఖాన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పాతకక్షల నేపథ్యంలోనే రౌడీషీటర్‌ బాబూఖాన్‌ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. నడిరోడ్డుపై మర్డర్‌తో హసన్‌నగర్ వాసులు హడలిపోయారు.

పాతబస్తీలో ప్రకంపనలు రేపిన రౌడీషీటర్‌ హాజీని ఎందుకు అరెస్ట్‌ చేయరు? ఎందుకు పోలీసులు భయపడుతున్నారు? అంటూ మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ గతంలో ప్రశ్నలు లేవనెత్తారు. పోలీసులను డిమాండ్‌ కూడా చేశారు. అరెస్ట్‌ చేయకుండా వదిలేయడమేంటని అన్నారు. కొన్ని రోజులకే హాజీ దారుణ హత్య గురయ్యారు. అప్పటి నుంచి వరుస క్రైమ్‌లు మొదలయ్యాయి. రౌడీషీటర్‌ హజీ హత్యతో మొదలైన మర్డర్‌లు ఆగడం లేదు. నెలకో హత్య సంచలనం సృష్టిస్తోంది.

2013లో రౌడీషీటర్‌ హాజీ హత్యకు గురయ్యారు. హజీ హత్యలో పాల్గొన్న జాఫర్‌ను సొహైల్‌ గ్యాంగ్‌ చంపేసింది. వెంటనే సొహైల్‌ను అసద్‌గ్యాంగ్‌ మట్టుబెట్టింది. ఆ తర్వాత ఈహత్యకు ప్రతీకరాంగా అసద్‌ను ప్రత్యర్ధి గ్యాంగ్‌ చంపేసింది. అసద్‌మర్డ్‌కేసులో సాక్షియైన బాబూఖాన్‌ ఇప్పుడు హత్యకు గురయ్యాడు. ఇవాళ మర్డర్‌ కేసులో తుది తీర్పు రావాల్సి ఉంది. కోర్టుకు హాజరై సాక్ష చెబుతాడని భావించిన ప్రత్యర్థి గ్యాంగ్‌ అతన్ని దారుణంగా చంపేసింది. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బాబూఖాన్‌పై ఒత్తిడి చేశారు. అయితే అందుకు నిరాకరించడంతో బాబూఖాన్‌ను ప్రత్యర్థులు చంపేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అసద్‌ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని చెల్లెలి కూతురు భర్త బాబూఖాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే తాను తప్పుడు సాక్ష్యం చెప్పనని చెప్పడంతో నిన్న రాత్రి దారుణంగా హతమార్చారు. మరోవైపు చెల్లెలి కూతురు భర్తను కూడా బాబూ ఖాన్‌ గ్యాంగ్ లేపేసే అవకాశం ఉంది. మొత్తానికి పాతబస్తీ గ్యాంగ్‌ వార్‌తో జనం హడలిపోతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి