Telugu News Telangana Hyderabad TSRTC has decided to run new buses on Dil Sukh Nagar Kokapet routes for IT employees Telugu News
TSRTC: బంపరాఫర్ ప్రకటించిన ఆర్టీసీ.. వారి కోసం ఆ మార్గంలో నూతన బస్సు సర్వీసులు..
నగరాల్లో ఉరుకుల పరుగుల జీవనం. పక్కవారితో మాట్లాడేందుకు క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంటాం. ఇక ఇంటి నుంచి కాలు బయటపెడితే చాలు విపరీతమైన ట్రాఫిక్. గల్లీ నుంచి రహదారుల వరకు ఎక్కడ..
నగరాల్లో ఉరుకుల పరుగుల జీవనం. పక్కవారితో మాట్లాడేందుకు క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంటాం. ఇక ఇంటి నుంచి కాలు బయటపెడితే చాలు విపరీతమైన ట్రాఫిక్. గల్లీ నుంచి రహదారుల వరకు ఎక్కడ చూసినా వాహనాల రణగొణధ్వనులే. ఈ ఇబ్బందులను గమనించిన టీఎస్ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పిటికే ఎన్నో రకాల ఆఫర్లు, ప్యాకేజీలు, రాయితీలు ప్రకటించి ప్రయాణీకులను ఆకర్షిస్తున్న ఆర్టీసీమరో ముందడుగు వేసింది. ముఖ్యంగా సమయానికి ఆఫీస్ కు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. కొత్త మార్గాల్లో బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపింది. దిల్‌సుఖ్ నగర్ నుంచి కోకాపేట్ సెజ్ వరకూ సర్వీసులను నడిపిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 156K రూటులో ప్రయాణికుల సౌకర్యార్ధం దిల్‌సుఖ్‌నగర్ నుంచి కోకాపేట సెజ్ వరకూ 4 నూతన మెట్రో బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
కోకాపేట్ సెజ్ పరిసర ప్రాంత ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్.. దిల్‌సుఖ్‌నగర్ నుంచి కోఠి, నాంపల్లి, మెహదీపట్నం, లంగర్ హౌస్, బండ్లగూడ, తారామతిపేట, నార్సింగి మీదుగా కోకాపేట వరకూ బస్సును నడిపించాలని డిసైడ్ అయ్యారు. ప్రతి నలభై నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉదయం 6:00 గంటలకు మొదటి బస్సు, రాత్రి 8:40కి చివరి బస్సు ఉంటుందని తెలిపారు. కోకాపేట నుంచి మొదటి బస్సు ఉదయం 7:25 కు, చివరి బస్సు రాత్రి 10:07కు ఉంటుందని తెలిపారు. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.