Gold & Silver: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా పెరిగి షాకిచ్చిన వెండి.. హైదరాబాద్, విజయవాడలో ఎలా ఉన్నాయంటే..

బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇక గోల్డ్ అంటే భారతీయులకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మహిళలే కాకుండా పురుషులు కూడా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆలక్తి...

Gold & Silver: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా పెరిగి షాకిచ్చిన వెండి.. హైదరాబాద్, విజయవాడలో ఎలా ఉన్నాయంటే..
Follow us

|

Updated on: Sep 15, 2022 | 6:56 AM

బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇక గోల్డ్ అంటే భారతీయులకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మహిళలే కాకుండా పురుషులు కూడా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆలక్తి చూపిస్తుంటారు. అంతే కాకుండా పెట్టుబడిగా పెట్టేందుకు బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు. బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు ఉండటం సహజమే. ఇవాళ ఉన్న ధర రేపు ఉండకపోవచ్చు. రేపు ఉన్న ధర మరోరోజు ఉండకపోవచ్చు. ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. అందుకేనండి అది బంగారం అయింది. తాజాగా నిన్నటితో పోలిస్తే ఇవాళ పది గ్రాముల బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి, ₹46,730 కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.360 పెరిగి ₹50,980 కు రీచ్ అయింది. కాగా ఈ ధరలు GST, TCSలను మినహాయించినవి. ఈ ధరలకు ఇవి అదనం.

చెన్నై ₹47,010 ₹51,280 ముంబై ₹46,400 ₹50,620 ఢిల్లీ ₹46,550 ₹50,780 కోల్‌కతా ₹46,400 ₹50,620 బెంగళూరు ₹46,450 ₹50,680హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹46,400, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ₹50,620 గా ఉంది. కేరళలో ₹50,620, పుణెలో ₹50,650, అహ్మదాబాద్ లో ₹50,680, జైపూర్ లో ₹50,780, మధురైలో ₹51,280, విజయవాడలో ₹50,620, నాగ్‌పూర్ ₹50,650, సూరత్ లో ₹50,680, మంగళూరులో ₹50,680, విశాఖపట్నంలో ₹50,620 గా ఉంది.

వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే గురువారం కిలో వెండి పై రూ.600 పెరిగి, రూ.57,000కు చేరింది. దేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరల ద్వారా నిర్ణయిస్తారు. డాలర్‌తో రూపాయి మారకం కరెన్సీ కదలికపై ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు పెరగడం గమనార్హం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles