Tiranga Bike Rally: చార్మినార్ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Hyderabad Liberation Day:తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. విమోచన ఉత్సవాల్లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ..

Tiranga Bike Rally: చార్మినార్ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ.. ప్రారంభించిన కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి
Minister Kishan Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 15, 2022 | 1:02 PM

Minister Kishan Reddy: తెలంగాణ విమోచన రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు.. అన్ని రాజకీయ పార్టీలూ ఉత్సవాలపై వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఇవాళ బీజేపీ చేపట్టిన ర్యాలీ ఉత్సాహంగా సాగింది.  అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. విమోచన ఉత్సవాల్లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది. భాగ్యలక్ష్మీ ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ర్యాలీలో పాల్గొన్నారు. ఇక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి పరేడ్ గ్రౌండ్స్ మీదుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాల రెపరెపల మధ్య, కాషాయ తలపాగాలు ధరించిన బీజేపీ మహిళా కార్యకర్తలంతా ర్యాలీలో పాల్గొన్నారు.

చార్మినార్ నుంచి పరేడ్‌ గ్రౌండ్‌ వరకూ బౌక్‌లు దౌడు తీశాయి. సెప్టెంబర్‌ 17 సందర్భంగా హైదరాబాద్‌లో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సెక్యూరిటీ టైట్‌ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ సర్కార్‌ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది.

అటు.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా BJP జరుపుతోంది. ఈ పోటా పోటీ కార్యక్రమాలతో ఎక్కడా ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్‌గ్రౌండ్‌లో‌ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ‌ మంత్రి అమిత్ షా వస్తున్నారు. అదే రోజున ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం సభ నిర్వహిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్