Viral video: ఏంటి అందరి ముందు పెళ్లి కూతురు ఇలా చేసేసింది.. వధువు తండ్రి రియాక్షన్ ఏంటంటే..
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అపురూపమైన, అందమైన వేడుక. ఇది వారి లైఫ్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే ఎన్నో రకాల ప్లాన్స్ ఉంటాయి. మెహందీ ఫంక్షన్స్, హల్దీ వేడుకలు....
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అపురూపమైన, అందమైన వేడుక. ఇది వారి లైఫ్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే ఎన్నో రకాల ప్లాన్స్ ఉంటాయి. మెహందీ ఫంక్షన్స్, హల్దీ వేడుకలు.. ఇలా ఎన్నో. ఇక మనసుకు నచ్చిన వాళ్లే తమ జీవిత భాగస్వామిగా వస్తే ఇక అంతకంటే ఆనందం ఏముంటుంది. పెళ్లి సమయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. పెళ్లి అనే మాట వినగానే సాధారణంగా ప్రతి ఆడపిల్లకు ఆనందం, భయం ఉంటుంది. అయితే మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆ సంతోషానికి అవధులుండవు. మనసైన వాడు తాళి కడుతుంటే ఆ క్షణం అలాగే నిలిచిపోతే బాగుండు అని కోరుకోని వారు ఎవరూ ఉండరేమో.. తమిళనాడులోని ఓ వధువుకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
తమిళనాడు కు చెందిన ఓ యువతి ఓ యువకుడిని ఇష్టపడింది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పింది. వారు కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రుల నిర్ణయం, ప్రేమించిన వ్యక్తే భర్తగా వస్తున్నాడన్న ఆనందం ఆ యువతిని నిలవనీయలేదు. పెళ్లి తంతు కోసం ఆతృతగా ఎదురు చూసింది. తీరా పెళ్లి సమయం రానే వచ్చింది. మనసైన వాడే మెడలో తాళి కడుతుంటే ఆ సంతోషం పట్టలేకపోయింది. వెంటనే వరుడిని గట్టిగా పట్టుటకుని ముద్దు పెట్టేసింది. చుట్టూ బంధువులు, అతిథులు వీరి చర్యకు సంతోషంగా నవ్వుకున్నారు. ఈ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి