BCCI: గంగూలీ, జైషాలకు ఊరట.. మరో మూడేళ్లు పదవులు పదిలం.. సుప్రీం ఆదేశం!

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాలకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. మరో రెండేళ్ల పాటు..

BCCI: గంగూలీ, జైషాలకు ఊరట.. మరో మూడేళ్లు పదవులు పదిలం.. సుప్రీం ఆదేశం!
Ganguly
Follow us

|

Updated on: Sep 14, 2022 | 6:06 PM

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాలకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. మరో మూడేళ్లు పాటు తమ పదవుల్లో కొనసాగేందుకు రూట్ క్లియర్ చేసింది. ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’‌ను తొలగిస్తూ బీసీసీఐ చేసిన రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. స్టేట్ అసోసియేషన్‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్ల పాటు నిరంతర పదవీకాలం కలిగి ఉండవచ్చని సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించింది. లోధా కమిటీ సిఫారసుల్లో మార్పులకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో వాళ్లకు ఈ అవకాశం దక్కింది.

‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ అంటే ఏంటి.?

ఆఫీస్ బేరర్ ఎవరైనా కూడా స్టేట్ అసోసియేషన్ పాలకమండలిలోనైనా, బీసీసీఐలోనైనా లేదా రెండింటిలోనూ మూడేళ్ల చొప్పున(రెండు దఫాలు) పదవులు చేపడితే.. నెక్స్ట్ దఫాలో పని చేయకూడదు. మూడేళ్ళు విరామం తీసుకున్నాక పోటీ చేయాలి. అటు స్టేట్ అసోసియేషన్‌లో.. ఇటు బీసీసీఐలో పదవుల్లో ఉన్నట్లయితే.. రెండు దఫాలు బాధ్యతలు చేపట్టినట్లే.. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా పదవులకు రాజీనామా చేయాల్సిందే. అయితే ఇప్పుడు ఆ రూల్‌ను బీసీసీఐ రాజ్యాంగం నుంచి తొలగించడం.. సుప్రీం కోర్టు అందుకు ఆమోదించడంతో వీరిద్దరూ మరో రెండేళ్లు తమ పదవుల్లో కొనసాగవచ్చు.