ICC T20 Rankings: ఇక తగ్గేదేలే.. టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన విరాట్.. ఒకే ఒక్క సెంచరీతో భారీ జంప్
Virat Kohli: 'ఫామ్ టెంపరరీ.. క్లాస్ పర్మినెంట్' అన్న మాటలను నిజం చేస్తూ మళ్లీ మునపటి ఫామ్‌లో చెలరేగిపోయాడు టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆసియా కప్‌లో సెంచరీతో పాటు మొత్తం 276 పరుగులు చేసిన విరాట్ తనపై వస్తోన్న విమర్శలకు గట్టిగానే సమాధానం చెప్పాడు.
Virat Kohli: ‘ఫామ్ టెంపరరీ.. క్లాస్ పర్మినెంట్’ అన్న మాటలను నిజం చేస్తూ మళ్లీ మునపటి ఫామ్‌లో చెలరేగిపోయాడు టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆసియా కప్‌లో సెంచరీతో పాటు మొత్తం 276 పరుగులు చేసిన విరాట్ తనపై వస్తోన్న విమర్శలకు గట్టిగానే సమాధానం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 1020 రోజుల తర్వాత 71వ సెంచరీ సాధించిన కోహ్లీ త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా ఆసియాకప్ ప్రదర్శనతో తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చాడీ స్టార్ ప్లేయర్. గత వారం ర్యాంకింగ్స్‌తో పోలిస్తే ఏకంగా 14 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ ప్లేస్‌కు చేరుకున్నాడు. త్వరలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌ల్లోనూ రాణిస్తే టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రపీఠాన్ని చేరుకోవడం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక టీ20 ర్యాంకింగ్స్ టాప్-10లో టీమిండియా నుంచి కేవలం సూర్యకుమార్ యాదవ్ (4వ ప్లేస్) మాత్రమే ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో ఉన్నాడు. ఆసియాకప్‌లో విఫలమైన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మరో స్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్‌కు పడిపోయాడు. పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన టాప్ ప్లేస్‌ని కాపాడుకోగా.. సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక ఆసియా కప్‌లో ఆఫ్ఘన్‌పై 5వికెట్లతో చెలరేగిన భువనేశ్వర్ కుమార్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతను ఏడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి టాప్-10లో నిలిచిన ఏకైక బౌలర్ భువీ ఒక్కడే కావడం గమనార్హం. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
Big rewards for star performers from the #AsiaCup2022 in the latest update of the @MRFWorldwide ICC Men’s T20I Player Rankings ?
Details ⬇️ https://t.co/B8UAn4Otze
— ICC (@ICC) September 14, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..