AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: అందరి ఆశీస్సులు ఉండాలని శ్రీవారిని ప్రార్థించా.. తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రపంచ కుబేరుడు..

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని భారత బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారి నిజపాద దర్శన సేవలో ముఖేష్..

Tirumala: అందరి ఆశీస్సులు ఉండాలని శ్రీవారిని ప్రార్థించా.. తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రపంచ కుబేరుడు..
Ambani
Amarnadh Daneti
|

Updated on: Sep 16, 2022 | 1:33 PM

Share

Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని భారత బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారి నిజపాద దర్శన సేవలో ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి ముఖేష్ అంబానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాది తిరుమలలోని శ్రీవారి ఆలయం అభివృద్ధి చెందుతూ.. మెరుగవుతూ ఉందన్నారు. మాకు అందరి ఆశీస్సులు ఉండాలని వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించానని అన్నారు పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.1.50 కోట్లు విరాళం ఇచ్చారు ముఖేష్ అంబానీ.  శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి డీడీని ముఖేష్ అంబానీ అందజేశారు.

గతంలో ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తిరుమల వెంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందించారు. కోటి 11లక్షల రూపాయలను శ్రీవారి ఆలయానికి అందించగా.. ఆమొత్తాన్ని ఉచిత అన్నదాన కార్యక్రమానికి వినియోగించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి
Ambani 2

Ambani 2

Ambani 3

Ambani 3

Ambani 4

Ambani 4

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి