AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shehbaz Sharif: మిత్రదేశాలు కూడా తమను అడుక్కునే వాళ్ళుగా చూస్తున్నాయి. ఆ దేశ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల కాలంలొ సంభవించిన భారీ వరదల కారణంగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇతర దేశాల సమాయం కోసం ఎదురచూస్తోంది. ఒకటి రెండు దేశాలు మినహా..

Shehbaz Sharif: మిత్రదేశాలు కూడా తమను అడుక్కునే వాళ్ళుగా చూస్తున్నాయి. ఆ దేశ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
Shehbaz Sharif
Amarnadh Daneti
|

Updated on: Sep 16, 2022 | 2:19 PM

Share

Pakistan: ఇటీవల కాలంలొ సంభవించిన భారీ వరదల కారణంగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇతర దేశాల సమాయం కోసం ఎదురచూస్తోంది. ఒకటి రెండు దేశాలు మినహా మిగిలిన దేశాలు పాకిస్తాన్ కు సహాయం చేసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. ఏదైనా దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. ఇరుగు, పొరుగు దేశాలు.. ముఖ్యంగా కొన్ని మిత్రదేశాలు ఆర్థికంగా సహాయం అందిస్తాయి. కాని పాకిస్తాన్ వైఖరి కారణంగా ఆదేశానికి ఆర్థిక సహకారం అందిచడానికి కొన్ని దేశాలు వెనుకడుగు వేశాయి. పాకిస్తాన్ ను ఆదుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చినప్పటికీ పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల న్యాయవాదుల సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరకు మిత్ర దేశాలు కూడా తమను అడుక్కునే వాళ్ళుగా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ మిత్ర దేశానికి వెళ్లినా లేదా ఫోన్‌ చేసినా.. డబ్బు కోసమే వచ్చామని అనుకుంటున్నారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమకంటే చిన్న దేశాలు కూడా ఆర్థికంగా తమకంటే బలంగా ఉన్నాయని.. అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దేశం ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదుర్కొందని.. వరదలు ఆ పరిస్థితిని మరింత దిగజార్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ను ఇటీవల భారీ వరదలు ముంచెత్తాయి. గత 30 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా భారీ వరదలు సంభవించడంతో దయాది దేశం అతలాకుతలమైంది. సుమారు 3కోట్ల30లక్షల మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికి పాకిస్తాన్ లో మూడోవంతు దేశం నీటిలోనే ఉంది. వరదల కారణంగా 12 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఈనేపథ్యంలో పాకిస్తాన్ లో వరద బాధితులను ఆదుకునేందుకు 150 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం చేయాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఇప్పటివరకు కేవలం 38 మిలియన్‌ డాలర్లు మాత్రమే సమకూరినట్లు యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది. ఈక్రమంలో తమ దేశానికి అనుకున్నంత సాయం అందకపోవడంతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమను మిత్ర దేశాలు కూడా బిచ్చగాళ్లుగా చూస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..