Viral View: హోమ్ వర్క్ చేయమన్న తల్లి.. ఎగ్గొట్టడానికి భలేగా రీజన్ చెప్పిన పిల్లాడు.. ఏంటో తెలిస్తే నవ్వాపరు!
పిల్లల మనసు ఆటలాడుకోవడంవైపు లాగితే.. అమ్మకు రకరకాల సాకులు చెప్పి హోమ్ వర్క్ చేయకుండా పారిపోతారు. ఇప్పుడు అలాంటి ఒక చిన్నారి సాకు వెలుగులోకి వచ్చింది. అది తెలిస్తే.. మీరు పడి పడి నవ్వుతారు.
Viral View: బాల్యం ఎప్పుడూ ఎవరికైనా మధురమే.. ముఖ్యంగా స్కూల్ కు వెళ్లే సమయంలో జరిగే సంఘటనలు, స్నేహం.. స్నేహితులు అత్యంత మధురమైన జ్ఞాపకాలుగా జీవితాంతం గుర్తుండిపోతాయి. ముఖ్యంగా స్కూల్ డేస్ లో హోమ్‌వర్క్ ని ఎగ్గొట్టడానికి మీరు ఏదో ఒక సాకు లేదా మరేదైనా రీజన్ చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఒకొక్కసారి అటువంటి సంఘటనలు గుర్తుకు వచ్చినా వెంటనే పెదవులపై చిరునవ్వు కలుగుతుంది. చిన్నతనంలో .. మనసుకి చదువుకోవాలన్నా, రాయాలన్నా కష్టంగా అనిపిస్తుంది. ఎంతసేపూ ఆటలు వైపు మనసు పోతుంది. ఉదయం నుంచి సాయంత్రం, సాయంత్రం నుంచి రాత్రి.. ఇలా ఎప్పుడు ఏ సమయం సందర్భం దొరికినా హోమ్ వర్క్ ఎగ్గొట్టిమరీ ఆటలు ఆదుకోవాలని చూస్తారు. అందుకనే ళ్ల అమ్మ వాళ్లను తమ పిల్లలకు స్కూల్ లో ఇచ్చిన హోమ్ వర్క్ ను చేయించడానికి ప్రయత్నిస్తారు. దగ్గర కూర్చోబెట్టుకుని హోం వర్క్ చేయించే తల్లిదండ్రులు ఉన్నారు. అయితే అప్పుడు పిల్లల మనసు ఆటలాడుకోవడంవైపు లాగితే.. అమ్మకు రకరకాల సాకులు చెప్పి హోమ్ వర్క్ చేయకుండా పారిపోతారు. ఇప్పుడు అలాంటి ఒక చిన్నారి సాకు వెలుగులోకి వచ్చింది. అది తెలిస్తే.. మీరు పడి పడి నవ్వుతారు.
ఈ చిలిపి ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కి చెందినది. ఐదో తరగతి చదువుతున్న పిల్లాడు హోం వర్క్ ను ఎగ్గొట్టాలని భావించాడు. అందుకు ఒక గొప్ప ప్లాన్ వేశాడు. ఆలోచించి ఒక సాకుని తల్లికి చెప్పడానికి ఆలోచించాడు. తన తనయుడు తనకు చెప్పిన సాకుతో ఆ తల్లి కూడా ఆలోచనలో పడింది. ప్రస్తుతం ఈ బాలుడి చెప్పిన రీజన్.. తల్లి తీసుకున్న నిర్ణయం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
పిల్లవాడి అద్భుతమైన ఆలోచన: హోంవర్క్ సమయంలో.. పిల్లవాడు తల్లి ముందు తన ముక్కులో టిష్యూ పేపర్ పెట్టుకున్నాడు. కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి. దీంతో తాను చదుకోవాల్సిన పుస్తకాన్ని పక్కన పెట్టి.. బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. దీంతో ఆ బాలుడి తల్లి ఏమి జరిగింది అని అడిగింది. వెంటనే.. ఆ బాలుడు తనకు పుస్తకాల వాసన పడడం లేదని.. ఎలర్జీ అని తల్లికి చెప్పాడు. అంతేకాదు.. ఇక తాను ఇక హోంవర్క్ చేయలేనని తల్లికి ముద్దుముద్దుగా చెప్పాడు. తన కొడుకు రీజన్ విన్న తల్లి.. ఆలోచనలో పడింది. గత ఐదేళ్లలో ఎప్పుడూ పుస్తకాల స్మెల్ తో ఎలర్జీ లేదని కదా.. మరి ఇప్పుడు ఎలా జరిగింది? అని ఆలోచించింది. వెంటనే చిన్నారి విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న తల్లి.. డాక్టర్ దగ్గరకు వెళ్దాం అని చెప్పింది. తల్లి డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్తానని అంటే.. ఆ బాలుడు నో అన్నాడు. దీంతో తల్లికి తన కొడుక్కి ఇక జిమ్మిక్కులు చేయడం మానేసి సైలెంట్‌గా హోంవర్క్ చేయమని చెప్పింది.
‘Homework allergy’: boy claims reaction takes 5 years to ‘incubate’ goes viral https://t.co/TUSIIiwgR4
— South China Morning Post (@SCMPNews) September 14, 2022
చిన్నారి మాట్లాడిన మాటలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో జనాలు ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఈ పిల్లవాడు నిజంగా టాప్ క్లాస్ నటుడు.’ మరోవైపు, మరొక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘సోదరా! పిల్లవాడి మనసు.. బాల్యం ఎంతో అద్భుతం అని అంటే.. మరొకరు ‘మేము కూడా హోమ్‌వర్క్‌ను చేయకుండా ఎగ్గొట్టడానికి ఇలాంటి సాకులు చెప్పామని బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..