Viral News: ముగ్గురు పిల్లలకు అమ్మ.. పదో తరగతి పరీక్షల్లో క్లాస్‌ టాపర్‌.. ఆమె కథ స్పూర్తిదాయకం..

సబ్రినాకు తొమ్మిదో తరగతి పూర్తి కాగానే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఓ బాబు పుట్టారు.. భర్త, పిల్లలు, కుటుంబ బాగోగులు చూసుకుంటూ..

Viral News: ముగ్గురు పిల్లలకు అమ్మ.. పదో తరగతి పరీక్షల్లో క్లాస్‌ టాపర్‌.. ఆమె కథ స్పూర్తిదాయకం..
10th Class Mother
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 16, 2022 | 9:00 AM

Viral News: ఆడపిల్లలకు పెళ్లి చేశారంటే.. ఇక చదువుకు గుండు సున్న పెట్టాల్సిందే..కానీ, కొందరు మాత్రం అత్తారింటికి వెళ్లిన తర్వాత కూడా తమలోని చదువుకోవాలనే తపనను తీర్చుకుంటారు. భర్త, అత్తమామలు, ఇంటి బాధ్యతలతో పాటుగానే.. చదువును కూడా కొనసాగిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఇలా పెళ్లి తర్వాత చదువుకుంటున్న అమ్మాయిల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ, పిల్లలు పుట్టిన తర్వాత కూడా చదువును కొనసాగించడం ఇబ్బందికర విషయమనే చెప్పాలి..కానీ, ఇక్కడ ముగ్గురు పిల్లలకు అమ్మ అయిన తర్వాత ఓ మహిళ పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది.. అది కూడా క్లాస్‌ టాపర్‌గా నిలిచింది. వివిధ కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన ఎంతోమందికి స్ఫూర్తిని నింపింది.ఈ జమ్ముకశ్మీర్‌లో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన సబ్రినాకు తొమ్మిదో తరగతి పూర్తి కాగానే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఓ బాబు పుట్టారు.. భర్త, పిల్లలు, కుటుంబ బాగోగులు చూసుకుంటు ఇంటిపట్టునే ఉంటుంది. అయితే, పిల్లలు స్కూల్‌కి వెళ్తున్న టైమ్‌లో తనకు కూడా చదువుకోవాలనే తపన మళ్లీ కలిగింది. ఇదే విషయాన్ని భర్త, అత్తామామలకు చెప్పింది. వారు ఒప్పుకోవడంతో ప్రైవేటుగా పదో తరగతిలో చేరింది. ఉన్నత విద్య అభ్యసించేలానే తన కోరికకు పట్టుదల తోడవడంతో పదో తరగతి ద్వై వార్షిక పరీక్షల్లో క్లాస్‌ టాపర్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి