Heavy Rains: లక్నోలో ఘోర ప్రమాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన గోడ.. 9 మంది దుర్మరణం
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు గోడ కుప్పకూలడంతో 9 మంది మృత్యువాత పడ్డారు. కాంట్ ప్రాంతంలోని దిల్‌కుషా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కుప్పకూలడంతో అక్కడే నిద్రిస్తున్న 9మంది అక్కడికక్కడే చనిపోయారు.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు గోడ కుప్పకూలడంతో 9 మంది మృత్యువాత పడ్డారు. కాంట్ ప్రాంతంలోని దిల్‌కుషా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కుప్పకూలడంతో అక్కడే నిద్రిస్తున్న 9మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉండగా.. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నగరంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగానే గోడ కూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. NDRF బృందం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే విపత్తు సహాయ నిధి నుండి మృతులకు రూ.4 లక్షల సహాయం ప్రకటించారు. క్షతగాత్రులందరికీ సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని డీఎం, పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. కాగా మృతులంతా కూలీలే. నిర్మాణ పనులు జరుగుతుండడంతో చాలా కాలంగా ఇక్కడే కుటుంబంతో జీవిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..