AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russian – Ukraine war: ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం ఆర్థిక ప్యాకేజీ.. రష్యా, చైనా మధ్య జరిగిన సమావేశం తర్వాతే ఈ నిర్ణయం.. అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదేనా..

తాజాగా మరో 600 మిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. దశల వారీగా ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం చేస్తోంది అమెరికా. రష్యాను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు ఆర్థిక దన్ను అందిస్తోంది. ఇందులో..

Russian - Ukraine war: ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం ఆర్థిక ప్యాకేజీ.. రష్యా, చైనా మధ్య జరిగిన సమావేశం తర్వాతే ఈ నిర్ణయం.. అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదేనా..
U.s. Ukraine
Sanjay Kasula
|

Updated on: Sep 16, 2022 | 9:52 AM

Share

ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచింది అగ్రరాజ్యం. తాజాగా మరో 600 మిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. దశల వారీగా ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం చేస్తోంది అమెరికా. రష్యాను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు ఆర్థిక దన్ను అందిస్తోంది. ఇందులో సైనిక సామాగ్రిని పంపనున్నట్లు గురువారం ప్రకటించింది. కొత్త షిప్‌మెంట్ – ఇందులో కౌంటర్ ఆర్టిలరీ రాడార్, కౌంటర్‌డ్రోన్ సిస్టమ్‌లు, మైన్-క్లియరింగ్ పరికరాలు కూడా ఉంటాయి. పెంటగాన్ ఇటీవలి కాలంలో పెంటగాన్ పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని పంపుతున్న ధోరణిని కొనసాగిస్తుంది. ఉక్రెయిన్‌లోని దక్షిణ, తూర్పు,  ఈశాన్య ప్రాంతాలలో భారీ పోరాటాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది అమెరికా.

ఇదిలావుంటే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ V. పుతిన్‌తో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన మొదటి ముఖాముఖి సమావేశం జరిగిన కొద్ది గంటల్లో అమెరికా ఈ నిర్ణయం ప్రకటించడం.. పెంటగాన్ స్టాక్‌పైల్స్ నుంచి సైనిక సామాగ్రీ పంపించడం రష్యా,చైనాలను అమెరికా హెచ్చరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా సాయంతో రష్యాపై ఉక్రెయిన్‌ మెరుపు దాడులు చేస్తోంది‌.

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా, ఇప్పుడు ఈ యుద్ధం నుంచి ఎలా బయట పడాలో తెలియక తంటాలు పడుతోంది. కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌ దళాలు మెరుపు దాడులు చేపట్టడంతో ఖార్కివ్‌ నుంచి వెనక్కి తగ్గాయి రష్యా దళాలు. రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాల నుంచి ఆరు వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. డాన్‌బాస్క్‌లో చాలా భూభాగాన్ని తిరిగి సొంతం చేసుకున్నామని చెబుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..