AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మాస్‌ డ్యాన్స్‌తో ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తున్న హోంగార్డు.. నా ఉద్యోగం అంటే నాకెంతో ఇష్టమంటూ ఇలా..

వాహనాల నుంచి వెలువడుతున్న పొగ, ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద భయపెట్టే పెద్ద పెద్ద శబ్ధాలతో వారు చేస్తున్న ఉద్యోగం నరకం కంటే తక్కువేమీ కాదనే చెప్పాలి.

Viral Video: మాస్‌ డ్యాన్స్‌తో ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తున్న హోంగార్డు.. నా ఉద్యోగం అంటే నాకెంతో ఇష్టమంటూ ఇలా..
Police Control Traffic
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2022 | 12:40 PM

Share

Viral Video:  కొంతమంది తాము చేస్తున్న ఉద్యోగాలను ప్రేమిస్తారు.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నవ్వుతూనే కనిపిస్తారు. ట్రాఫిక్ పోలీసుల పని చాలా కష్టతరమైనది. ముఖ్యంగా మనదేశంలో వాహనాలు అధికంగా ఉండటం వల్ల వాహనాల నుంచి వెలువడుతున్న పొగ, ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద భయపెట్టే పెద్ద పెద్ద శబ్ధాలతో వారు చేస్తున్న ఉద్యోగం నరకం కంటే తక్కువేమీ కాదనే చెప్పాలి. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ట్రాఫిక్ పోలీసుగా వీధుల్లో ఉన్న ఒక హోంగార్డు తన పనిని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నాడు. ఎంతబాగా ఎంజాయ్‌ చేస్తూ డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తున్నాడు..ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తుంది.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ సిటీ హార్ట్ హాస్పిటల్ సమీపంలో ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న ఒక హోంగార్డు వీడియో ఇది. సదరు ట్రాఫిక్ పోలీస్ వెరైటీగా డ్యాన్స్‌ చేస్తూ… ట్రాఫిక్‌ని కంట్రోల్‌ చేస్తున్నాడు. హోంగార్డు తన ప్రత్యేకమైన శైలిలో ట్రాఫిక్‌ను నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని సిటీ హార్ట్ హాస్పిటల్ సమీపంలో జోగేంద్ర కుమార్ అనే ట్రాఫిక్ పోలీసు ఇలా తనదైన స్టైల్లో ట్రాఫిక్‌ని కంట్రోల్‌ చేస్తున్నాడు. అతను విజిల్ వేస్తూ..డ్యాన్స్ చేస్తూ కార్లు, బైకులకు సిగ్నల్‌ ఇస్తున్నాడు. అతను నవ్వుతూ వివిధ భంగిమలు కూడా పెడుతున్నాడు. ఒక లేన్‌ని దాటమని డ్రైవర్‌లను అడగటం కూడా ఆ వీడియోలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ANI వీడియోను షేర్ చేసి ఈ వీడియోకు ఇలా క్యాప్షన్‌ ఇచ్చారు. ఇది ప్రజలను సంతోషపరుస్తుంది. దీన్ని ఆస్వాదిస్తూ తమ గమ్యాన్ని చేరుకుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగితే జనాలు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఇలా చేశాను. నేను నా పనిని ఆస్వాదిస్తున్నాను” అని జోగేంద్ర కుమార్‌ని చెప్పినట్టుగా పేర్కొన్నారు. అతని నుండి ప్రేరణ పొందిన వినియోగదారులు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. అతని ఉత్సాహం ఆఫీసుకు వెళ్లే వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది… నేను అతనిని ప్రతిరోజూ చూస్తాను… దేవుడు అతనిని ఆశీర్వదిస్తాడు. అంటూ రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి