AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డెలివరీ బాయ్ సాహసానికి వావ్ అనాల్సిందే.. ఏకంగా ట్రైన్ నే చేజ్ చేసేశాడు..

చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. అన్ని పనులూ దానితోనే. ఏ వస్తువు కావాలన్నా అడుగు బయటపెట్టకుండా ఒక్క క్లిక్ తో ఇంటి గడప కు చేరుతున్నాయి. పెరిగిపోతున్న సాంకేతికతతో కావాల్సిన వస్తువులు నట్టింట్లోకి వచ్చేస్తున్నాయి...

Viral Video: డెలివరీ బాయ్ సాహసానికి వావ్ అనాల్సిందే.. ఏకంగా ట్రైన్ నే చేజ్ చేసేశాడు..
Order Delivery Video
Ganesh Mudavath
|

Updated on: Sep 16, 2022 | 1:08 PM

Share

Viral Video: చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. అన్ని పనులూ దానితోనే. ఏ వస్తువు కావాలన్నా అడుగు బయటపెట్టకుండా ఒక్క క్లిక్ తో ఇంటి గడప కు చేరుతున్నాయి. పెరిగిపోతున్న సాంకేతికతతో కావాల్సిన వస్తువులు నట్టింట్లోకి వచ్చేస్తున్నాయి. కష్టపడాల్సిన పని లేదు, చెమటలు కక్కాల్సిన అవసరం అంతకన్నా లేకుండా ఇంటికొచ్చి మరీ కావాలసిన వాటిని ఇచ్చే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రకాల ఆప్ లు హోమ్ డెలివరీ తో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఇదంతా ఓ వైపు.. కానీ మరో వైపు పరిస్థితులు అలా ఉండవు. ఆర్డర్ డెలివరీ చేసే బాయ్స్ పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ?. ఎంత కష్టం కలిగినా వారు తమ విధి ధర్మాన్ని ఎప్పుడూ అతిక్రమించరు. ఎండైనా, వానైనా కస్టమర్లకు ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. సరైన సమయానికి ఆర్డర్ ను ఇంటింటికి చేరుస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి. వారు ఎంత కష్టపడినా, ఇబ్బందులు ఎదుర్కొన్నా వాటిని కనబడనీయకుండా కస్టమర్లతో వ్యవహిరించే విధానం వారిపై గౌరవాన్ని మరింత పెంచుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో డెలివరీ బాయ్ వర్క్ పై తనకున్న డెడికేషన్‌ తో ఇంటర్నెట్ లో హీరో అయిపోయాడు. కదులుతున్న రైలును సైతం చేజ్‌ చేసి ఓ కస్టమర్‌కు వస్తువును అందించాడు. వివిధ రకాల వస్తువులను హోమ్‌ డెలివరీ అందించే డంజో ఏజెంట్‌ రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ వెంట పరుగెత్తి మరీ కస్టమర్‌ కు ఆర్డర్ అందించాడు. కస్టమర్‌ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్టుగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడికి ప్రమోషన్‌ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి