Telugu News Trending Biker Saved By His Helmet Twice Video was gone viral in social media Telugu Viral News
Viral Video: హెల్మెట్ పెట్టుకుంటే మీకు దేవుడి ఆశీస్సులు ఉన్నట్లే.. నమ్మకం లేదా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
బైక్ (Bike) లు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు, ప్రభుత్వం చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. బరువుగా ఉంటుందనో, జుట్టు దెబ్బతింటుందనో హెల్మెట్ ధరించేందుకు ఆసక్తి చూపించడం..
బైక్ (Bike) లు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు, ప్రభుత్వం చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. బరువుగా ఉంటుందనో, జుట్టు దెబ్బతింటుందనో హెల్మెట్ ధరించేందుకు ఆసక్తి చూపించడం లేదు. వీరి తీరును గమనించిన అధికారులు జరిమానాలు కూడా విధిస్తున్నారు. అయినా మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో వివరిస్తున్నారు. హెల్మెట్ ఆవశ్యకతను చెబుతూ మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిలో చాలా వరకు హెల్మెట్ (Helmet) ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే హెల్మెట్ ఎందుకు ధరించడం అనుకునే వారు ఒకసారి ఈ వీడియో చూస్తే వారి అభిప్రాయం కచ్చితంగా మార్చుకుంటారు. ఢిల్లీ పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఒళ్లు గగుర్పొడుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో బైకర్ రెండు సార్లు ప్రాణాలతో బయటపడ్డాడు. రాత్రి సమయంలో ఓ కారు రోడ్డు పై వెళ్తోంది. అదే సమయంలో ఓ బైకర్ స్పీడ్ గా వస్తాడు. అదుపుతప్పి రోడ్డుపై పడిపోతాడు. అయితే అతనికి గాయాలేమీ కాలేదు. పైకి లేచి నిలబడేంత లోపే మరో ప్రమాదానికి గురవుతాడు. అక్కడే ఉన్న సూచిక బోర్డు కూలిపోయి నేరుగా అతని తలపై పడిపోతుంది. ఈ రెండు ఘటనల్లో అతని తలపైనే జరిగాయి. అదృష్టవశాత్తు బైకర్ హెల్మెట్ ధరించడంతో రెండు ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాలతో బయటపట్టాడు. లేకుంటే అతని పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది.