Telugu News Trending A video of a young woman falling from a scooty due to rain has gone viral on social media Telugu Viral News
Video Viral: నీ కష్టం ఎవరికీ రావద్దు బ్రదర్.. గర్ల్ ఫ్రెండ్ ను బయటకు తీసుకెళ్లాలనుకున్నాడు.. కానీ వర్షం దెబ్బకు..
ప్రేమ (Love) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా స్పెషల్. ఎలా పుడుతుందో తెలియదు కానీ ఎన్నో అపురూపమైన అనుభవాన్ని తెచ్చిపెడుతుంది. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ప్రేమ చిగురించడం సహజమే. లాంగ్ డ్రైవ్ లు...
ప్రేమ (Love) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా స్పెషల్. ఎలా పుడుతుందో తెలియదు కానీ ఎన్నో అపురూపమైన అనుభవాన్ని తెచ్చిపెడుతుంది. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ప్రేమ చిగురించడం సహజమే. లాంగ్ డ్రైవ్ లు, ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లడం, గంటలు గంటలు కబుర్లు చెప్పుకోవడం సాధారణమే. ఆ క్షణాలను వారు జీవితాంతం గుర్తుంచుకుంటారు. ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో ప్రేమలో పడితే గానీ తెలియదు అని అంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్టం రాకుండా కాపాడుకోవడం, ఒకరినొకరు విడిచి ఉండలేనంత సాన్నిహిత్యం పెంచుకుంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. వర్షాకాలంలో నగరాల రోడ్డు ఎలా ఉంటాయో తెలిసిందే. రోడ్ల పై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఫలితంగా చాలాసార్లు వాహనాలు పట్టుకోల్పోయి ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్లిప్ లో ఓ యువకుడు తన ప్రియురాలిని స్కూటీపై ఎక్కించుకుని తీసుకువెళ్తాడు. అదే సమయంలో వర్షం కురవడంతో రోడ్డుపై నీరు నిలిచిపోతుంది. వాహనాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు యువకుడు స్కూటీ దిగుతాడు. కానీ వెహికిల్ కంట్రోల్ తప్పి కింద పడిపోతుంది. దీంతో ప్రియురాలు కూడా వరద నీటిలో పడిపోతుంది. స్కూటీతో పాటు దానిపై కూర్చున్న ప్రియురాలు కూడా రోడ్డుపై పడి నీట మునిగిన రోడ్ల మురికి నీటిలో తడిసి ముద్దవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్ కు ఇప్పటివరకు భారీగా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.