AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine Students: ఉక్రెయిన్‌లో మెడికల్ చదువుతున్న విద్యార్థులకు కేంద్రం షాక్‌.. అలా చేయడం అసాధ్యమంటూ స్పష్టం..

Ukraine Students: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరిగిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కెరీర్‌పై...

Ukraine Students: ఉక్రెయిన్‌లో మెడికల్ చదువుతున్న విద్యార్థులకు కేంద్రం షాక్‌.. అలా చేయడం అసాధ్యమంటూ స్పష్టం..
Telangana Students
Narender Vaitla
|

Updated on: Sep 15, 2022 | 8:30 PM

Share

Ukraine Students: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరిగిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఉన్నపలంగా, చదువును మధ్యలోనే ఆపేసి ఇండియాకు వచ్చేసిన వైద్య విద్యార్థులకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులకు భారత్‌లో మెడిసిన్‌ సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉక్రెయిన్‌ నుంచి వచ్చి భారత్‌లో వైద్య విద్యను కొనసాగించేందుకు అనుమతి కోరిన విద్యార్థులకు ఆ అవకాశం ఇవ్వలేమని సుప్రీం కోర్టుకు ఇచ్చిన ఆఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

జస్టిస్ హేమంత్ గుప్తా నేతృత్వం వహిస్తున్న సుప్రీం కోర్టు ధర్మాసనం…ఈ అంశంపై తదుపరి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. నీట్‌లో సీట్లు రాని కారణంగానే విద్యార్థులు ఉక్రెయిన్‌ను వెళ్లారన్ని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న ప్రతికూల వాతావరణం నేపథ్యంలో.. అక్కడ విద్యను కొనసాగించే అవకాశం లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే అడ్వకేట్ అశ్వర్య సిన్హా కూడా సుప్రీంకోర్టులో ఇదే విషయమై పిటిషన్ వేశారు.

దాదాపు 14 వేల మంది వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి ఉన్నట్టుండి తిరిగి రావాల్సి వచ్చిందని చెప్పారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరగణలోకి తీసుకొని భారత్‌లో విద్యను కొనసాగించేలా చొరవ చూపాలని పిటిషన్‌లో కోరారు. అయితే తాజాగా కేంద్రం ఇచ్చిన అఫిడవిట్‌తో ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి