UPSC ESE 2022: యూపీఎస్సీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ సారి ఎన్ని పోస్టులున్నాయంటే..

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో.. ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ (UPSC ESE Notification 2023) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా..

UPSC ESE 2022: యూపీఎస్సీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ సారి ఎన్ని పోస్టులున్నాయంటే..
UPSC ESE 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 15, 2022 | 3:34 PM

UPSC Engineering Services Examination 2023: భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో.. ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ (UPSC ESE Notification 2023) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 327 ఇంజనీరింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, డిప్లొమా లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్‌ లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్ (ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష లేదా వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలక్ట్రానిక్స్‌, రేడియో ఫిజిక్స్‌, రేడియో ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 4, 2022 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.200లు దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష (ప్రిలిమినరీ/మెయిన్స్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: సెప్టెంబర్‌ 14, 2022.
  • దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 4, 2022.
  • అప్లికేషన్‌ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: అక్టోబర్‌ 4, 2022.
  • ప్రిలిమినరీ పరీక్ష తేది: ఫిబ్రవరి 19, 2023.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు