AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Frozen Berries: ఈ పండ్లు మీరు కూడా తింటున్నారా? జాగ్రత్త.. లివర్‌ పూర్తిగా చెడిపోతుంది.. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల హెచ్చరిక

ఈ మధ్యకాలంలో వృద్ధులు, గర్భిణీ మహిళల్లో హెపటైటిస్ సమస్య అధికంగా తలెత్తుతుంది. మన దేశంలో ప్రతి యేటా ఈ వ్యాధి భారీన పడుతున్నవారి సంఖ్య తక్కువేమీకాదు. ఐతే న్యూజిలాండ్‌లో మాత్రం హెపటైటిస్..

Frozen Berries: ఈ పండ్లు మీరు కూడా తింటున్నారా? జాగ్రత్త.. లివర్‌ పూర్తిగా చెడిపోతుంది.. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల హెచ్చరిక
Frozen Berries
Srilakshmi C
|

Updated on: Sep 14, 2022 | 8:39 PM

Share

Risk of Hepatitis A from imported frozen berries: ఈ మధ్యకాలంలో వృద్ధులు, గర్భిణీ మహిళల్లో హెపటైటిస్ సమస్య అధికంగా తలెత్తుతుంది. మన దేశంలో ప్రతి యేటా ఈ వ్యాధి భారీన పడుతున్నవారి సంఖ్య తక్కువేమీకాదు. ఐతే న్యూజిలాండ్‌లో మాత్రం హెపటైటిస్ ఎ వ్యాధి చాలా అరుదుగా సంభవిస్తుంది. అందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదు. 2015లో ఈ దేశం దిగుమతి చేసుకున్న ఫ్రోజెన్‌ బెర్రీలకు, హెపటైటిస్ ఎ వ్యాధి వ్యాప్తికి సంబంధం ఉన్నట్లు ఫుడ్‌ సేఫ్టీ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విన్సెంట్ అర్బకిల్ బుధవారం (సెప్టెంబర్‌ 14) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాధి భారీనపడిన ముగ్గురు వ్యక్తుల్లోని వైరస్‌ జీనోటైపింగ్‌లో ఈ మార్పును గమనించినట్లు అర్బకిల్ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

‘పూర్తి సమాచారం అందనప్పటికీ.. ఫ్రోజెన్‌ బెర్రీలను తినడం వల్ల హెపటైటిస్ A బారిన పడే ప్రమాదం అధికంగా ఉన్నట్లు’ ఆయన వెల్లడించారు. ‘న్యూజిలాండ్‌లో వేసవి కాలంలో ఫ్రాజెన్‌ బెర్రీలను ఎక్కువగా వినియోగిస్తారు. ఐతే వీటిని తినే ముందు నిముషం పాటు 85 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉడకబెట్టాలని న్యూజిలాండ్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ పండ్లను తినేముందు ఈ జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. సాధారణంగా దిగుమతి చేసుకున్న బెర్రీలను అమ్మకానికి పెట్టేముందు వాటి నమూనాలను టెస్ట్ చేస్తాం. ఐతే మార్కెట్లో విక్రయించే ఆహారాన్ని పూర్తిగా నిరోధించే అవకాశం ఉండదు. విస్తృత పరిధిలో ప్రమాదాన్ని గుర్తిస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం. అందువల్ల ప్రోజెన్‌ బెర్రీలను తినేముందు తీసుకోవల్సిన జాగ్రత్తలను ప్రస్తావిస్తున్నాం. ఎందుకంటే వినియోగదారుల భద్రతే మా ప్రధమ ప్రాధాన్యమని’ అర్బకిల్ అన్నారు.

ఇవి కూడా చదవండి

నిజానికి హెపటైటిస్‌ ఎ అనే వైరస్‌ ఈ వ్యాధిని వ్యాపింపజేస్తుంది. ఈ వ్యాధి బారీన పడ్డవారికి లివర్‌ పూర్తిగా దెబ్బతింటుంది. న్యూజిలాండ్‌లో ఈ వ్యాధి అరుదుగా ఉన్నప్పటికీ భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హెపటైటిస్‌ ఎ సర్వసాధారణం. ఇది అంటువ్యాధి కావడం వల్ల సులువుగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి భారీన పడితే వికారం, కడుపు నొప్పి, పసుపు కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఎటువంటి లక్షణాలు కన్పించకపోవచ్చు. వ్యాధి ముదిరితే మత్రం జ్వరం, కామెర్లు, ఆకలి మందగించడం, వికారం, అలసట వంటి లక్షణాలు కన్పిస్తాయి.