- Telugu News Photo Gallery Sleeping Tips: Have a spoonful of honey before hitting the bed says Experts, know the reason here
Honey: పడుకునే ముందు ఒక స్పూన్ తేనే తిన్నారంటే..
తేనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, హైడ్రేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సహజంగా తీపి లక్షణం కలిగి ఉంటే తేనే ఆకలిని అరికట్టడమే కాకుండా, రాత్రంతా ప్రశాంతంగా..
Updated on: Sep 14, 2022 | 6:06 PM

తేనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, హైడ్రేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సహజంగా తీపి లక్షణం కలిగి ఉంటే తేనే ఆకలిని అరికట్టడమే కాకుండా, రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవడానికి, అలర్జీలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, గాయాలను నయం చేయడానికి, గొంతు నొప్పి నివారణకు తేనె ఎంతో ఉపయోగపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి తేనె దివ్యౌషధంలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

నిద్రపోవడానికి 30 నిమిషాల ముందు ఒక టీ స్పూన్ తేనె తింటే హాయిగా నిద్రపడుతుంది. చాలా మందికి అర్థరాత్రిలో హఠాత్తుగా మెలకుంవ వస్తుంది. ఎందుకంటే శరీరంలో షుగర్ లెవెల్ పెరిగినప్పుడు కార్టిసాల్ విడుదల చేయాలనే సందేశం మెదడుకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.

లివర్ ఆరోగ్యానికి తేనె ఇంధనంలా పనిచేస్తుంది. అంతేకాకుండా గ్లూకోజ్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.

టీస్పూన్ తేనెను గోరువెచ్చని పాలలో కలిపి తాగడం వల్ల పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు.





























