Hyderabad Crime News: మల్కాజిగిరి మైనర్‌ బాలిక అత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు

రెండేళ్ల క్రితం మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మల్కాజిగిరి కోర్టు ఈ రోజు జీవిత ఖైదు విధించింది. స్థానికంగా కలకలం రేపిన ఈ కేసులో..

Hyderabad Crime News: మల్కాజిగిరి మైనర్‌ బాలిక అత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Malkajigiri Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 14, 2022 | 8:59 PM

Life Sentence For Raping Minor girl: రెండేళ్ల క్రితం మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మల్కాజిగిరి కోర్టు ఈ రోజు జీవిత ఖైదు విధించింది. స్థానికంగా కలకలం రేపిన ఈ కేసులో నిందితుడికి ఎట్టకేలకు కోర్టు శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌ మల్కాజిగిరిలో నివాసముంటున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో పెద్ద కుమార్తెను లాలూ సెబాస్టియన్‌ అనే వ్యక్తి ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2020లో జరిగిన ఈ ఘటనపై బాలిక తల్లి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. సాక్ష్యాధారలను కోర్టుకు సమర్పించడంతో.. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రోజు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. జీవిత ఖైదుతో పాటు రూ.15,000లు జరిమానా కూడా విధించింది. కాగా గతంలో కూడా ముషీరాబాద్‌లో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నాడు.